వీరభద్రం దర్శకత్వంలో రాజశేఖర్ సినిమా !

Friday,October 18,2019 - 12:28 by Z_CLU

ఇటివలే ‘కల్కి’ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన డా.రాజశేఖర్ త్వరలోనే వీరభద్రం చౌదరి డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. రాజశేఖర్ కోసం ఓ థ్రిల్లర్ కథను సిద్దం చేసి వినిపించిన వీరభద్రం లేటెస్ట్ గా రాజశేఖర్ నుండి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు.

ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ అయిన ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. నటీ నటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. అతి త్వరలోనే అఫీషియల్ గా సినిమాను అనౌన్స్ చేసి నవంబర్ నుండి షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నారు. మరి  రాజశేఖర్ ను థ్రిల్లర్ జోనర్ లో వీరభద్రం ఎలా ప్రెజెంట్ చేస్తాడో..చూడాలి.