ఆరు భాగాలుగా విశాల్ సినిమా

Tuesday,October 30,2018 - 10:54 by Z_CLU

ప్రస్తుతం తన సూపర్ హిట్ సినిమాలకు సంబంధించి వరుసగా సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నాడు  విశాల్… ఇటివలే పందెం కోడి సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన విశాల్ త్వరలో  ‘అభిమన్యుడు2’ కూడా రెడీ చేసే పనిలో ఉన్నాడు. ఆ తర్వాత ‘డిటెక్టివ్‌’ సినిమాకి సంబంధించి వరుసగా ఆరు సీక్వెల్స్ చేసే ప్లాన్ లో ఉన్నాడు విశాల్.

ఇటివలే ‘పందెం కోడి 2’ ప్రమోషన్ లో భాగంగా మీడియా ముందుకొచ్చిన విశాల్  ‘డిటెక్టివ్‌’ 2 సినిమా విదేశాల్లో చిత్రీకరణ చేయబోతున్నామని. అక్కడ ఓ కేసును సాల్వ్‌ చేయడానికి వెళ్ళే కథతో ఆ సినిమా తెరకెక్కనుందని త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానుందని తెలిపాడు. సాధారణంగా మనం చిన్నప్పటి నుండి హాలీవుడ్‌ సినిమాలు ఎక్కువగా చూస్తూ పెరిగాం. డిటెక్టివ్‌ ఆ స్టయిల్‌ ఆఫ్‌ మూవీ. ‘డిటెక్టివ్‌’  మొత్తం ఆరు భాగాలుగా చేయాలని డైరెక్టర్‌ మిస్కిన్‌గారు అనుకుంటున్నారు. ఆయనతో సినిమా చేయడానికి నేను ఎప్పుడూ ఇష్టపడతాను అని చెప్పుకొచ్చాడు.