అఖిల్ సినిమా హైలెట్స్

Saturday,December 24,2016 - 09:02 by Z_CLU

హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య రిలీజైన అఖిల్ ఫస్ట్ వెంచర్ ‘అఖిల్’ బోలెడన్నీ సర్ ప్రైజెస్ తో తెరకెక్కింది. వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదనిపించే 5 మెయిన్ రీజన్స్.

akhil-4

టైగర్ ఫైట్ : అఖిల్ సినిమాలో ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుడని వైల్డ్ ఎలిమెంట్ టైగర్ ఫైట్. టాలీవుడ్ లో ఎన్ని యాక్షన్ ఎంటర్ టైనర్స్ వస్తున్నా, టైగర్ ఫైట్ మాత్రం రీసెంట్ గా ఏ సినిమాలో చూడలేదు. సిచ్యువేషన్ కి తగ్గట్టుగా బ్లాక్ జాగ్వార్ తో అఖిల్ చేసే ఈ ఫైట్ లో వైట్ జాగ్వార్ లా కనిపిస్తాడు అఖిల్.

akhil-2

రొమాంటిక్ ఎలిమెంట్స్ : అఖిల్ కి హీరోయిన్ గా సాయెషా పర్ఫెక్ట్ పెయిర్. ఇద్దరికీ అఖిల్ సినిమా ఫస్ట్ వెంచరే అయినా, ఎవరూ కొత్తగా అనిపించలేదు. ముఖ్యంగా రొమాంటిక్ సీక్వెన్సెస్ లో ఇద్దరి కెమిస్ట్రీ అదుర్స్.

akhil-6

హాలీవుడ్ రేంజ్  : అఖిల్ సినిమాలో మెయిన్ ఎలిమెంట్ లవ్ అయితే, ఇంపార్టెంట్ ఎలిమెంట్ జువా. సాధారణంగా ఈ సినిమాని సింపుల్ గా ఇండియన్ ఫారెస్ట్ లో తీసినా, వర్కవుట్ అయ్యే కాన్సెప్టే. కానీ ఆఫ్రికన్ అడవుల్లో ప్లాన్ చేయడం వల్ల సినిమాకి హాలీవుడ్ రేంజ్ ఎఫెక్ట్ పడింది. సినిమా చూస్తున్నంతససేపూ హాలీవుడ్ సినిమాలో మన వాళ్ళను చూసుకున్న ఫీలింగ్ కలుగుతుంది.

 akhil-1

సెంటిమెంట్ : సినిమా రిలీజ్ కి ముందు నుండే లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ అనిపించుకున్నా, ఫ్యామిలీ సెంటిమెంట్ ఎక్కడా డ్రాప్ అవ్వకుండా కేర్ తీసుకున్నాడు వి.వి.వినాయక్. అఖిల్ కి, రాజేంద్ర ప్రసాద్ కి మధ్య వచ్చే సీన్స్ ఓ సారి కడుపుబ్బా నవ్విస్తే, మరోసారి కంటితడి పెట్టిస్తాయి.

akhil-3

కామెడీ : కామెడీ కింగ్ బ్రహ్మానందం సినిమా సెకండాఫ్ లో ఆవగింజంత కన్ఫ్యూజ్ అవుతాడు. ఆ కన్ఫ్యూజన్ సినిమాకి సరిపడా హ్యూమర్ ని క్రియేట్ చేస్తుంది. సెకండాఫ్ మొత్తం హీరోతో పాటు జర్నీ చేసే కామెడీ సీక్వెన్సెస్, విలన్ క్రియేట్ చేసే ప్రతి హై టెన్షన్ సీక్వెన్స్ తరవాత ఆడియెన్స్ ని రిలాక్స్ చేస్తుంటాయి.

reason-6

నాగార్జున : అఖిల్ సినిమాకు మరో ఎట్రాక్షన్ నాగార్జున. సినిమా మొత్తం అఖిల్ దే అయినప్పటికీ.. అక్కినేేని-అక్కినేని అనే సాంగ్ లో నాగ్ మెరుపు ఎప్పీయరెన్స్ అభిమానుల్లో ఆనందం నింపింది. తండ్రికొడుకుల ఆన్ స్క్రీన్ ప్రజెన్స్ అదుర్స్ అనిపించింది.

reason-7

కాంటెస్ట్ : జీ-సినిమాలు ఎక్స్ క్లూజివ్ గా అఖిల్ కాంటెస్ట్ కూడా రన్ చేస్తోంది. సినిమా ప్రసారమయ్యే సమయంలో అడిగే సులువైన ప్రశ్నలకు సమాధానాాలను SMS ద్వారా పంపించి.. ఎట్రాక్టివ్ లెదర్ జాకెట్స్ గెలుచుకునే అవకాశం పొందండి.