జీ సినిమాలు ( డిసెంబర్ 24th)
Friday,December 23,2016 - 10:00 by Z_CLU

నటీనటులు : భాను చందర్, హీరా
ఇతర నటీనటులు : బ్రహ్మానందం, లక్ష్మి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : రాజ్ – కోటి
డైరెక్టర్ : సాగర్
ప్రొడ్యూసర్: V.S. రామిరెడ్డి
రిలీజ్ డేట్ : జనవరి 1, 1992
భానుచందర్ నటించిన అల్టిమేట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ పబ్లిక్ రౌడీ. పసితనంలోనే తన తల్లి అనారోగ్యం పాలవ్వడంతో తనను కాపాడుకునే ప్రయత్నంలో రౌడీలా మారతాడు. తన తండ్రి గురించి తెలుసుకున్న హీరో ఆ తరవాత ఏం చేస్తాడు..? తన తండ్రిని చేరుకుంటాడా లేదా అన్నదే ప్రధాన కథాంశం.
——————————————————————

నటీనటులు : అక్కినేని నాగేశ్వర రావు, కాంచన, శారద
ఇతర నటీనటులు : గుమ్మడి, సూర్యకాంతం, నాగభూషణం, రమణ మూర్తి, రాజబాబు, రమాప్రభ, రాధాకుమారి, జయకుమారి, చంద్ర మోహన్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S. రాజేశ్వర రావు
డైరెక్టర్ : B.A. సుబ్బారావు
ప్రొడ్యూసర్ : D. మధుసూదన రావు
రిలీజ్ డేట్ : 1971
——————————————————————

నటీనటులు : అక్కినేని నాగేశ్వర రావు, శ్రీదేవి, జయసుధ
ఇతర నటీనటులు : మురళి మోహన్, మోహన్ బాబు, గుమ్మడి, ప్రభాకర రెడ్డి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి
డైరెక్టర్ : దాసరి నారాయణ రావు
ప్రొడ్యూసర్ : వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని
రిలీజ్ డేట్ : 1 ఫిబ్రవరి 1981
టాలీవుడ్ లెజెండ్రీ యాక్టర్ ANR నటించిన అద్భుతమైన సినిమాలలో ప్రేమాభిషేకం ఒకటి. దాసరి నారాయణ రావు గారి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆధారంగా చేసుకుని ఆ తరవాత కూడా ఎన్నో ప్రేమ కథలు తెరకెక్కాయి. ANR నట జీవితంలో మైలు రాయిలాంటిదీ ప్రేమాభిషేకం. ఈ సినిమాలో సన్నివేశానుసారంగా పొదిగిన పాటలు సినిమాకే హైలెట్.
——————————————————————

నటీనటులు : సుమంత్ అశ్విన్, నందిత
ఇతర నటీనటులు : తేజస్వి మాడివాడ, చాందిని, షామిలి అగర్వాల్, సప్తగిరి, సాయి కుమార్ పంపన, MS నారాయణ, దువ్వాసి మోహన్ & అనిత చౌదరి
మ్యూజిక్ డైరెక్టర్ : జీవన్ బాబు
డైరెక్టర్ : హరినాథ్
ప్రొడ్యూసర్ : సూర్యదేవర నాగస్వామి & B. మహేంద్ర బాబు
రిలీజ్ డేట్ : 15 ఆగష్టు 2014
గర్ల్ ఫ్రెండ్ కోసం ఆరాటపడుతూ కనిపించిన ప్రతి అమ్మాయిని ట్రై చేసే సిద్దూ ఎఫర్ట్స్ చిత్ర వల్ల స్పాయిల్ అయిపోతాయి. అప్పటి వరకు తనను ఒక్కసారి కూడా చూడని సిద్దు, ఫోన్ లోనే చిత్రతో గొడవ పడతాడు. మరో వైపు ఇంకో అమ్మాయితో సిన్సియర్ గా లవ్ లో పడతాడు. ఆ తరవాత ఏం జరిగిందనేది ప్రధాన కథాంశం.
——————————————————————

హీరోహీరోయిన్లు – మంచు విష్ణు, మమతా మోహన్ దాస్
నటీనటులు – నాగార్జున, మోహన్ బాబు, నాజర్, నెపోలియన్, సునీల్, బ్రహ్మానందం
సంగీతం – ఎం.ఎం. కీరవాణి
దర్శకత్వం – పి.వాసు
విడుదల తేదీ – 2008, ఫిబ్రవరి 1
లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మోహన్ బాబు నిర్మించడమే కాకుండా.. ఓ కీలక పాత్ర కూడా పోషించిన చిత్రం కృష్ణార్జున. మంచు మనోజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో నాగార్జున కూడా మరో కీలక పాత్ర పోషించడంతో ఇది భారీ సినిమాగా మారిపోయింది. కృష్ణుడిగా నాగార్జున, భక్తుడిగా విష్ణు చేసిన హంగామా ఈ సినిమాకు హైలెట్. సినిమా మధ్యలో మోహన్ బాబు, బాబా గెటప్ లో అలరిస్తారు. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాకు పి.వాసు దర్శకత్వం వహించారు. తెలుగులో సోషియో-ఫాంటసీ జానర్ లో వచ్చిన అతికొద్ది చిత్రాల్లో ఇది కూడా ఒకటి.
——————————————————————

నటీనటులు : అఖిల్ అక్కినేని, సాయేషా సైగల్
ఇతర నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, సప్తగిరి, హేమ, మహేష్ మంజ్రేకర్, వెన్నెల కిషోర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్, S.S. తమన్
డైరెక్టర్ : V.V.వినాయక్
ప్రొడ్యూసర్ : సుధాకర్ రెడ్డి, నితిన్
రిలీజ్ డేట్ : నవంబర్ 11, 2015
అక్కినేని అఖిల్ డెబ్యూ ఫిల్మ్ అఖిల్. సాయేషా హీరోయిన్ గా నటించింది. పక్కా రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా, రిలీజైన అన్ని థియేటర్ లలోను సూపర్ హిట్టయింది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాని వి.వి. వినాయక్ దర్శకత్వం వహించాడు. అఖిల్ ఆఫ్రికాలో జాగ్వార్ తో చేసే ఫైట్ హైలెట్ గా నిలుస్తుంది.
——————————————————————

నటీ నటులు : నారా రోహిత్ , శుబ్ర అయ్యప్ప
ఇతర నటీనటులు : కోట శ్రీనివాస రావు, విష్ణు, జయ ప్రకాష్ రెడ్డి, గిరిబాబు, రంగనాథ్, రవి ప్రకాష్.
మ్యూజిక్ డైరెక్టర్ : సాయి కార్తీక్
డైరెక్టర్ : ప్రశాంత్ మండవ
ప్రొడ్యూసర్ : సాంబశివ రావు
రిలీజ్ డేట్ : 25 April 2004
అతి తక్కువ కాలంలోనే విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్న నారా రోహిత్ ఫస్ట్ సినిమా ఇది. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాని తరవాత తమిళంలో KO2 గా రీమేక్ కూడా చేశారు. మొదటి సినిమానే అయినా నారా రోహిత్ మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ సినిమాకి హైలెట్.