మరో డేట్ ఫిక్స్ చేసిన మహేష్...

Saturday,December 24,2016 - 10:23 by Z_CLU

ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా అహ్మదాబాద్ షెడ్యూల్ కూడా పూర్తయింది. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ మాత్రం ఇప్పటివరకు విడుదల చేయలేదు. ఇప్పటికే విడుదలకావాల్సిన ఫస్ట్ లుక్ ఇంకా వెలుగులోకి రాకపోవడంతో ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు. తాజాగా మహేష్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కు మరో డేట్ ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అదే జనవరి 26. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మహేష్-మురుగదాస్ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను కూడా ఎనౌన్స్ చేస్తారనే ప్రచారం సాగుతోంది.

మరోవైపు ఈ సినిమాకు సంభవామి అనే టైటిల్ ఫిక్స్ చేశారట. ఈ టైటిల్ ను ఫిలింఛాంబర్ లో రిజిస్టర్ కూడా చేయించారు. అయితే ఇదే టైటిల్ ను ఎనౌన్స్ చేస్తారా.. లేక మరో కొత్త టైటిల్ ను ఫ్రెష్ గా రిజిస్టర్ చేయించి ఎనౌన్స్ చేస్తారా అనే విషయంపై క్లారిటీ లేదు. మరోవైపు అహ్మదాబాద్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న మహేష్.. కుటుంబసభ్యులతో కలిసి న్యూయార్క్ వెళ్లాడు. క్రిస్మస్ ను అక్కడ సెలబ్రేట్ చేసుకొని, తిరిగిన జనవరి 4 నుంచి కొత్త షెడ్యూల్ లో జాయిన్ అవుతాడు.