భారతీయ డాక్యుమెంటరీకి ఆస్కార్

Monday,February 25,2019 - 12:19 by Z_CLU

ఇండియాలో తీసిన ఓ డాక్యుమెంటరీకి ఏకంగా ఆస్కార్ అవార్డు దక్కింది. గునీత్ మోంగా నిర్మించిన పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్ అనే డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డు వచ్చింది. 25 నిమిషాల డ్యూరేషన్ ఉన్న ఈ డాక్యుమెంట్రీని ఉత్తరప్రదేశ్ లోని హపూర్ ప్రాంతంలో తెరకెక్కించారు. రేకా జెతాబ్జీ ఈ డాక్యుమెంటరీకి దర్శకురాలు. ఈ డాక్యుమెంటరీలో ఎక్కువమంది మహిళలే నటించగా, తెరవెనక కూడా ఎక్కువమంది మహిళలే పనిచేశారు.

ఇక 91వ ఆస్కార్ అవార్డుల్లో.. రోమా, బ్లాక్ పాంథర్ సినిమాలు అత్యథికంగా అవార్డులు కొల్లగొట్టాయి. ఉత్తమ చిత్రంగా గ్రీన్ బుక్ నిలవగా, ఉత్తమ విదేశీ చిత్రంగా మెక్సికోకు చెందిన రోమ నిలిచింది. ఈ చిత్రాన్ని డైరక్ట్ చేసిన ఆల్ఫోన్సో క్యూరాన్ కు బెస్ట్ డైరక్టర్ అవార్డు దక్కింది.