సాహో నుంచి చాప్టర్-2 వస్తోందా..?

Monday,February 25,2019 - 12:52 by Z_CLU

షేడ్స్ ఆఫ్ సాహో.. ఫస్ట్ లుక్ వీడియోస్ కు సాహో యూనిట్ పెట్టిన కొత్త పేరిది. ఇందులో భాగంగా ఇప్పటికే షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్-1 వచ్చింది. ప్రభాస్ పై తీసిన ఆ మేకింగ్ వీడియో సూపర్ హిట్ అయింది. మరీ ముఖ్యంగా దుబాయ్, అబుదాదిలో తీసిన యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ సినిమా రేంజ్ లో ఉన్నాయి. ఇప్పుడీ సినిమా నుంచి చాప్టర్-2 రెడీ చేస్తోందట యూనిట్.

షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్-2ను మార్చి 3న విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఆ రోజున శ్రద్ధాకపూర్ పుట్టినరోజు. ఆ సందర్భంగా ఈ వీడియో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అయితే చాప్టర్-2లో కేవలం హీరోయిన్ ను మాత్రమే చూపిస్తారా, లేక శ్రద్ధాతో పాటు ప్రభాస్ ను కూడా చూపిస్తారా అనేది తేలాల్సి ఉంది. మరో 2 రోజుల్లో ఈ మేకింగ్ వీడియోపై ఓ క్లారిటీ రాబోతోంది.

దాదాపు 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది సాహో సినిమా. సుజీత్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఆగస్ట్ 15న విడుదల చేయాలనుకుంటున్నారు. శంకర్-ఎహసాన్-లాయ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ మేకింగ్ వీడియోస్ కు మాత్రం తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నాడు.