నవలా రచయితగా నాని

Monday,February 25,2019 - 11:37 by Z_CLU

క్యారెక్టర్ కొత్తగా ఉండేలా కేర్ తీసుకుంటాడు నాని. అలాంటి కొత్త క్యారెక్టర్స్ క్రియేట్ చేయడంలో దిట్ట విక్రమ్ కుమార్. ఇలాంటి ఇద్దరు వ్యక్తులు కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది? కచ్చితంగా కొత్తగా ఉంటుంది కదా. ప్రస్తుతం అలాంటి ప్రయత్నమే జరుగుతోంది. నాని-విక్రమ్ కుమార్ కాంబోలో గ్యాంగ్ లీడర్ సినిమా తెరకెక్కుతోంది.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఈ సినిమాలో నవలా రచయితగా కనిపిస్తాడట నాని. ఒక్కో దశలో ఒక్కో హీరోయిన్ అలా వచ్చిపోతుందట. అలా ఐదుగురు హీరోయిన్లను కవర్ చేస్తాడట. ఇక ఇతడి ఫ్యామిలీలో కూడా ఐదుగురు ఆడవాళ్లు ఉంటారని, వాళ్లకు ఇతడు గ్యాంగ్ లీడర్ అనే కాన్సెప్ట్ తో టీజర్ ను రిలీజ్ చేశారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమా టీజర్ తో అంచనాలు పెంచేసింది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని ఆగస్ట్ లో థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.