2.O చైనా వసూళ్లు

Friday,September 13,2019 - 12:08 by Z_CLU

రీసెంట్ గా చైనాలో విడుదలైన 2.O సినిమా నిన్నటితో వారం రోజుల రన్ పూర్తిచేసుకుంది. చైనాలో దాదాపు 84వేల స్క్రీన్స్ పై విడుదలైన ఈ విజువల్ వండర్ త్రీడీ సినిమా, అక్కడ కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. విడుదలైన మొదటి రోజే 9 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన ఈ సినిమా, నిన్నటి వసూళ్లతో కలుపుకొని వారం రోజుల్లో 3.08 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.

తాజా వసూళ్లతో ఇది చైనాలో 3 మిలియన్ డాలర్ క్లబ్ లో చేరిన భారతీయ సినిమాల జాబితాలోకి చేరింది. ఇప్పటికే ఈ క్లబ్ లో పలు బాలీవుడ్ సినిమాలున్నాయి. వాటిలో అన్నింటికంటే ముందు స్థానంలో దంగల్ సినిమా ఉంది. ఆ తర్వాత స్థానంలో సల్మాన్, షారూక్, హృతిక్ సినిమాలున్నాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి 2.O కూడా చేరింది.

రజనీకాంత్-శంకర్ కాంబోలో తెరకెక్కిక ఈ సినిమా భారతదేశంలోనే భారీ బడ్జెట్ చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో గ్రాఫిక్స్, హాలీవుడ్ రేంజ్ కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి. గ్రాఫిక్స్ కు తోడు మంచి కంటెంట్ కూడా ఉండడంతో చైనాలో కూడా 2.Oకు క్రేజ్ పెరిగింది.