ప్రేక్షకులని టైం అడిగిన సిద్దార్థ్

Thursday,May 02,2019 - 03:05 by Z_CLU

కెరీర్ స్టార్టింగ్ లో టాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సిద్దార్థ్ ఇప్పుడు కోలీవుడ్ కే పరిమితమయ్యాడు. తమిళ్ లో వరుస సినిమాలు చేస్తూ తెలుగు సినిమాలకి బై బై చెప్పేసిన సిద్దు లేటెస్ట్ గా తెలుగు ప్రేక్షకులకు ఓ ప్రామిస్ చేసాడు. ఇక కోలీవుడ్ కే పరిమితమా అనే ప్రశ్నకి ఫుల్ క్లారిటీతో జవాబిచ్చాడు.

“ఎవరు ఏమన్నా నేను తిరిగి వస్తాలే… మీకు ప్రామిస్ చేస్తున్నా కేవలం 18 నెలలు టైం ఇవ్వండి ప్రేక్షకులారా, గ్రేట్ కంటెంట్ తో వస్తున్నా…మాట్లాడుకుందాం” అంటూ ట్వీట్ చేసాడు సిద్దు. ఉన్నపళంగా సిద్దు ఇలా తెలుగు సినిమా గురించి ట్వీట్ చేయడంతో సిద్దు తెలుగు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

ఈ హీరో తెలుగులో మళ్ళీ ఎవరితో సినిమా చేయబోతున్నాడు..? దానికి 18 నెలలు ఎందుకు..? అనేవి పక్కనపెడితే… సిద్దార్థ్ తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నాడనేది హాట్ టాపిక్ గా మారింది.