మహేష్ కి తెలియకుండా భారీ ప్లాన్ !

Thursday,May 02,2019 - 01:20 by Z_CLU

‘మహర్షి’ మహేష్ కి స్పెషల్ ఫిలిం… ఈ సినిమాతో 25వ మైలురాయికి చేరాడు సూపర్ స్టార్. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ తనతో సినిమాలు చేసిన దర్శకులందరూ వస్తారని ఊహించారు ప్రేక్షకులు. కానీ అలా జరగలేదు. మహేష్ బాబుతో సినిమాలు చేసిన దర్శకుల్లో ఒక్క కొరటాల శివ మాత్రమే వేడుకలో కనిపించారు. అయితే ప్రేక్షకులు ఊహించే ఆ ఈవెంట్ త్వరలోనే ఉంటుందని అదే వేడుకలో తెలిపాడు నిర్మాత పివిపి. మహేష్ కి తెలియకుండా  గ్రాండ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేసేసాడు.

ఈ విషయాన్ని మహేష్ కి కూడా అక్కడే చెప్పాడు. ” మహేష్ గారు మీకు తెలియకుండా మే 18 న సక్సెస్ మీట్ ప్లాన్ చేస్తున్నాం… ఆ ఈవెంట్ లో మహేష్ గారితో వర్క్ చేసిన అందరు దర్శకులు, నిర్మాతలు కనిపిస్తారు. అలాగే నటీనటులను కూడా పిలిచే ప్రయత్నం చేస్తున్నాం” అంటూ దిల్ రాజు నుండి కూడా గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు.

సో మహేష్ 25 సినిమాకి సంబందించి మే 18 న విజయవాడలో ఇలా ఓ గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాడు పివిపి. మరి ఆ ఈవెంట్ కి మహేష్ దర్శకులందరూ ఎటెండ్ అవుతారా…లేదా చూడాలి.