రిలీజ్ కు ముందే రుచి చూపించాడు

Monday,November 07,2016 - 01:59 by Z_CLU

‘నకిలీ’ , ‘డా.సలీమ్’ సినిమాలతో కథానాయకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయి ఇటీవలే ‘బిచ్చగాడు’ తో కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘బేతాళుడు’. ఈనెల 17న విడుదలకానున్న ఈ సినిమాకు సంబంధించి ఓ కొత్త ప్రచార ప్రయోగాన్ని ప్రారంభించాడు విజయ్ ఆంటోనీ.

bethaludu-1

తాజాగా ఈ చిత్ర తెలుగు వెర్షన్ ఆడియో వేడుకకు హాజరైన విజయ్ ఆంటోనీ… భేతాళుడుకు సంబంధించి టైటిల్స్ నుంచి 15 నిమిషాల సినిమా చూపించేశాడు. ఈ 10 నిమిషాల సినిమాను చూసిన ప్రముఖులు… విడుదలకి ముందే విజయ్ ఆంటోనీ చేసిన ఈ ప్రయోగాన్ని మెచ్చుకుంటున్నారు. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటేకానీ ఎవరూ ఇలా ముందుగాానే 15 నిమిషాల సినిమా చూపించరు. బిచ్చగాడు విజయం తర్వాత వస్తున్న భేతాళుడు… కచ్చితంగా హిట్ అవుతుందనే బజ్ నడుస్తోంది.