'టూ కంట్రీస్' రీమేక్ స్టార్ట్ చేసిన సునీల్

Monday,November 07,2016 - 04:16 by Z_CLU

వరుస సినిమాలతో కథానాయకుడిగా దూసుకుపోతున్న సునీల్ మరో రీమేక్ సినిమాతో ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు. కెరీర్ ఆరంభం నుంచి రీమేక్ సినిమాలతో అలరిస్తున్న సునీల్.. ప్రస్తుతం మలయాళంలో ఘనవిజయం సాధించిన `టు కంట్రీస్` చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు.

     ఎన్.శంకర్ దర్శకత్వంలో ఈ రీమేక్ సినిమా… రాజకీయ, సినీ ప్రముఖుల సమక్షంలో ప్రారంభమైంది. రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా మొదలైంది. త్వరలోనే అమెరికాలో జరిగే భారీ షెడ్యూల్ లో 70 శాతం సినిమాను పూర్తిచేయబోతున్నారు. రెండు దేశాల మధ్య సున్నితమైన అంశాలతో తెరకెక్కే ఈ చిత్రానికి శ్రీధర్ సీపాన మాటలు అందిస్తుండగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.