'యమన్' మూవీ రివ్యూ

Friday,February 24,2017 - 05:13 by Z_CLU

విడుదల : ఫిబ్రవరి 24, 2017

నటీ నటులు : విజయ్ ఆంటోనీ, మియా జార్జ్

మ్యూజిక్ : విజయ్ ఆంటోనీ

మాటలు : భాష శ్రీ

సమర్పణ: మిర్యాల సత్యనారాయణరెడ్డి

నిర్మాత : మిర్యాల రవీందర్, లైకా ప్రొడక్షన్స్‌

నిర్మాణం : ద్వారకా క్రియేషన్స్‌, లైకా ప్రొడక్షన్స్‌

కథ- స్క్రీన్- సినిమాటోగ్రఫీ- దర్శకత్వం : జీవ శంకర్

 

విభిన్న కథా చిత్రాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు అందుకున్న విజయ్ ఆంటోనీ ‘బిచ్చగాడు’,’భేతాళుడు’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత నటించిన చిత్రం పొలిటికల్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ‘యమన్’. ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమా పై భారీ అంచనాలు పెంచిన ఈ సినిమా ఈ శుక్రవారం థియేటర్స్ లోకొచ్చింది. మరి ఈ సినిమాతో విజయ్ ఆంటోనీ మరో సూపర్ హిట్  అందుకున్నాడా..చూద్దాం…

కథ :

ఓ యాక్సిడెంట్ కేసును తనపై వేసుకొని జైలుకి వెళ్లి దేనికైనా తెగించే వ్యక్తిగా మారిన అశోక్ చక్రవర్తి(విజయ్ ఆంటోనీ) కొందరు రాజకీయ నాయకుల అండదండలతో జైలు నుంచి బయటికొస్తాడు. అలా జైలు నుంచి బయటికి వచ్చిన అశోక్ గతంలో తన తండ్రి దేవరకొండ గాంధీ(విజయ్ ఆంటోనీ)ని చంపిన సాంబ, నరసింహ వంటి రౌడీలతో పాటు ఎం.ఎల్.ఏ పాండుని రాజీకీయంగా ఎలా దెబ్బ కొట్టి అంతం చేశాడు… చివరికి తన తండ్రి కలగా మిగిలిన ఎం.ఎల్.ఏ పదవిని ఎలా సొంతం చేసుకొని రాజకీయ నాయకుడిగా ఎదిగాడు…అనేది సినిమా కథాంశం…

 

నటీనటుల పనితీరు :

ఇప్పటికే పలు డిఫరెంట్ క్యారెక్టరర్స్ తో ఎంటర్టైన్ చేసి నటుడిగా మంచి మార్కులు అందుకున్న విజయ్ ఆంటోనీ మరోసారి అలాంటి రెండు క్యారెక్టర్స్ తోనే ఎంటర్టైన్ చేశాడు. ముఖ్యంగా యంగ్ పొలిటీషియన్ గా తన నటనతో సినిమాకు హైలైట్ గా నిలిచాడు. మియా జార్జ్ తన గ్లామర్ తో హీరోయిన్ గా పరవాలేదనిపించుకుంది.. ఇక థియంగా రాజన్, సంగిలి మురుగన్, మరిముత్తు , చార్లీ, ప్రిన్జ్ నిథిక్, స్వామి నాథన్ తదితరులు తమ క్యారెక్టర్స్ కి పూర్తి న్యాయం చేశారు..

 

టెక్నీషియన్స్ :

ఈ సినిమాకు విజయ్ ఆంటోనీ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ప్లస్ అయింది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలను ఆర్.ఆర్ బాగా ఎలివేట్ చేసింది. ఇక దర్శకుడు ఎంచుకున్న పొలిటికల్ కథ తో పాటు స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది. కేవలం దర్శకుడిగానే కాకుండా సినిమాటోగ్రాఫర్ గా కూడా తన ప్రతిభ చాటుకున్నాడు జీవ శంకర్.. తెలుగులో భాష శ్రీ అందించిన పొలిటికల్ పవర్ ఫుల్ డైలాగ్స్ అలరించాయి. ఎడిటింగ్ బాగుంది.

జీ సినిమాలు సమీక్ష :

తన ప్రతీ సినిమాకు ఒక్కో జోనర్ ను , డిఫరెంట్ కథ ను సెలెక్ట్ చేసుకుంటూ తన దైన మార్క్ తో ఎంటర్టైన్ చేస్తున్న విజయ్ ఆంటోనీ ‘యమన్’ గా పొలిటికల్ థ్రిల్లర్ తో బాగానే ఎంటర్టైన్ చేశాడు. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ తన నటనతో ముందుకునడిపించి సినిమాకు హైలైట్ గా నిలిచాడు. అనుకోని సందర్భంలో తన ఓ కేసు ను తనపై వేసుకొని జైలు కెళ్లిన యువకుడు జైలు నుంచి బయటికొచ్చి ప్రస్తుత రాజకీయాల పై దృష్టి సాధించి రాజకీయనాయకుడిగా ఎలా ఎదిగాడు అనే పాయింట్ ను సరైన ట్విస్టులతో తన దైన స్క్రీన్ ప్లే తో చూపించి దర్శకుడిగా మంచి మార్కులు అందుకున్నాడు జీవ శంకర్.. ముఖ్యంగా కొన్ని పవర్ ఫుల్ పొలిటికల్ వార్నింగ్ సీన్స్ సినిమాను నిలబెట్టాయి. విజయ్ ఆంటోనీ నటన , రాజకీయనాయకులు పన్నే వ్యూహాలతో కూడిన సీన్స్ , ఫైట్స్ , సినిమాను మలుపు తిప్పే ట్విస్టులు, బ్యాగ్రౌండ్ స్కోర్, పొలిటికల్ డైలాగ్స్ , ,ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ సినిమాకు మెయిన్ హైలైట్స్ గా నిలవగా కొన్ని సన్నివేశాలను స్లో గా అనిపించే స్క్రీన్ ప్లే కాస్త మైనస్ గా నిలిచింది. ఓవరాల్ గా పొలిటికల్ డ్రామా గా తెరకెక్కిన ‘యమన్’ సినిమా అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తుంది…

 

రేటింగ్ : 3 /5