'విన్నర్' రివ్యూ
Friday,February 24,2017 - 06:16 by Z_CLU
విడుదల : ఫిబ్రవరి 24 ,2017
నటీ నటులు : సాయిధరమ్‌తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్
సినిమాటోగ్రఫీ : చోటా.కె.నాయుడు
సంగీతం: థమన్
ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి
కథ: వెలిగొండ శ్రీనివాస్
రచన: అబ్బూరి రవి, శ్రీధర్ సీపాన
నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని.
సుప్రీమ్ వంటి సూపర్ హిట్ సినిమా తరవాత సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ సినిమా ‘విన్నర్’ ఈ శుక్రవారం థియేటర్స్ లోకొచ్చింది. మెగా స్పీడ్ తో సూపర్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్న సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాతో ఎలాంటి విజయం అందుకున్నాడో…చూద్దాం…
కథ :
సిద్దార్థ్ అనే యువకుడు (సాయి ధరమ్ తేజ్) చిన్నతనంలో కొన్ని సంఘటనల వల్ల తన తండ్రి మహేందర్ రెడ్డి(జగపతి బాబు) కి దూరంగా ఉంటూ రేసింగ్, గుర్రాలపై ద్వేషం పెంచుకుంటాడు.. అలా తండ్రికి దూరంగా ఉంటూ జీవితాన్ని కొనసాగిస్తున్న సిద్దార్థ్ ఒక సందర్భంలో సితార(రకుల్) అనే రన్నర్ ని చూసి ప్రేమలో పడతాడు. అలా తన ప్రేమలో పడిన సిద్దార్థ్ ను ఓ అనుకోని సందర్భంలో ఆది అనే రేసింగ్ జాకీ తో బెట్ కట్టిస్తుంది సితార. అలా సితార ప్రేమ కోసం తనకిష్టం లేని రేసింగ్ మొదలుపెట్టిన సిద్దార్థ్… ఆ రేసింగ్ లో ఎలా గెలిచాడు.. చివరికి తనకు 20 ఏళ్ల క్రితం దూరమైన తండ్రికి ఎలా దగ్గరయ్యాడు.. అనేది సినిమా కథాంశం…
నటీనటుల పనితీరు :
ఎనర్జిటిక్ కుర్రాడిగా మరోసారి ఎంటర్టైన్ చేసి సినిమాకు హైలైట్ గా నిలిచాడు సాయిధరమ్ తేజ్. రకుల్ తన గ్లామరస్ యాక్టింగ్ తో సినిమాకు మరో హైలైట్ గా నిలిచింది.. తండ్రి పాత్రలో జగపతి బాబు క్యారెక్టర్ బాగుంది. పద్మ క్యారెక్టర్ తో వెన్నెల కిశోర్, సింగం సుజాత క్యారెక్టర్ లో పృథ్వి, పీటర్ హెయిన్స్ గా అలి, బిత్తిరి సత్తి తమ కామెడీ తో ఎంటర్టైన్ చేశారు. అనసూయ స్పెషల్ సాంగ్ లో ఆకట్టుకుంది. ముకేశ్ ఋషి, అనూప్ సింగ్ ఠాకూర్, ఒకప్పటి హీరోయిన్స్ కళ్యాణి – సోనియా అగర్వాల్, రఘు బాబు , సురేష్, వేణు, రఘు, ప్రియదర్శి తదితరులు తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు.
టెక్నీషియన్స్ పనితీరు :
ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ బాగుంది. థమన్ అందించిన సాంగ్స్ లో ‘సితార’, ‘నా బి సి సెంటర్లు’ అనే పాటలు మాత్రమే ఆకట్టుకున్నాయి. ఏ.ఎస్.ప్రకాష్ ఆర్ట్ వర్క్ బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు. కొన్ని డైలాగ్స్ అలరించాయి..వెలిగొండ శ్రీనివాస్ అందించిన కథ, గోపీచంద్ మలినేని స్క్రీన్ ప్లే రొటీన్ గా ఉన్నాయి..ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.
జీ సినిమాలు సమీక్ష :
‘సుప్రీమ్’ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విన్నర్’ పై మొదటి నుంచి భారీ అంచనాలే నెలకొన్నాయి. దీనికి తోడు స్టార్స్ ప్రమోషన్ ఈ సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చింది. మరి ఇంత హైప్ నడుమ థియేటర్స్ లోకొచ్చిన ఈ సినిమా సరికొత్త కథాంశంతో ఎంటర్టైన్ చేస్తుందనుకునే ప్రేక్షకులను కాస్త నిరుత్సాహ పరుస్తుంది. వెలిగొండ అందించిన కథతో పాటు దర్శకుడు గోపీచంద్ మలినేని స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకునేలా సాగదు. సాయి ధరమ్ తేజ్ పర్ఫార్మెన్స్, రకుల్ గ్లామర్, జగపతి బాబు- సాయిధరమ్ తేజ్ మధ్య వచ్చే కొన్ని సీన్స్, వెన్నెల కిషోర్, పృథ్వి, అలి, బిత్తిరి సత్తి కామెడీ, కొన్ని డైలాగ్స్ సినిమాకు హైలైట్ గా నిలవగా బోర్ కొట్టించే స్క్రీన్ ప్లే సినిమాకు పెద్ద మైనస్ గా నిలిచింది. ఓవరాల్ గా రొటీన్ కథతో ఫక్తు కమర్షియల్ ఎంటర్టైనర్ గా ‘విన్నర్’ కొన్ని కామెడీ సీన్స్ తో కొంత వరకూ అలరిస్తుంది…
రేటింగ్ : 2.5 /5