'సప్తగిరి ఎల్.ఎల్.బి' రివ్యూ

Thursday,December 07,2017 - 02:29 by Z_CLU

నటీ నటులు : సప్తగిరి, కశిష్‌ వోరా, సాయి కుమార్, శివ ప్రసాద్, గొల్లపూడి మారుతి రావు, షకలక శంకర్ తదితరులు

మాటలు : పరుచూరి బ్రదర్స్‌

సంగీతం : విజయ్‌ బుల్గానిన్‌

ఫొటోగ్రఫీ : సారంగం ఎస్‌.ఆర్‌

నిర్మాత : డా. రవికిరణ్‌

దర్శకత్వం : చరణ్‌ లక్కాకుల.

రిలీజ్ డేట్ : డిసెంబర్ 7,2017

 

‘జాలి ఎల్.ఎల్.బి’ అనే హిందీ సినిమా రీమేక్ తో ‘సప్తగిరి ఎల్.ఎల్.బి’ అంటూ ఈరోజే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు సప్తగిరి… ఓ స్ట్రాంగ్ కంటెంట్ తో బాలీవుడ్ లో సూపర్ హిట్ సాధించిన సినిమాకు రీమేక్ కావడంతో ప్రారంభం నుంచే ఈ సినిమాపై పాజిటీవ్ టాక్ వుంది. మరి ఈ సినిమాతో సప్తగిరి ఎలా ఎంటర్టైన్ చేసాడో..తెలుసుకుందాం.

 

కథ :

చిత్తూర్ జిల్లా పుంగనూరులో లాయర్ గా జీవితాన్ని గడిపే సప్తగిరి తను టెక్ అప్ చేసిన కేసులన్నీ ఓడిపోతుండడంతో హైదరాబాద్ కోర్ట్ లాయర్ అయిన తన బావ(డా.రవి కుమార్) సాయంతో హైదరాబాద్ కెళ్ళి అక్కడ కోర్ట్ లో ఓ పెద్ద కేసు వాదించి పేరు సంపాదించుకోవాలనుకుంటాడు… ఈ క్రమంలో దాదాపు 200 కేసులను వాదించి ఎంతో పేరొందిన లాయర్ రాజ్ పాల్(సాయి కుమార్) డీల్ చేసి క్లోజ్ చేసేసిన యాక్సిడెంట్ కేసును రీ ఇన్వెస్టిగేషన్ చేయాలంటూ ఆ కేసును రీ ఓపెన్ చేయిస్తాడు సప్తగిరి. ఇంతకీ ఆ యాక్సిడెంట్ లో చనిపోయిన బిచ్చగాళ్ళు ఎవరు..? చివరికీ సప్తగిరి ఈ కేసులో రాజ్ పాల్ ను ఎదిరించి ఎలా గెలిచాడు… అనేది సినిమా కథాంశం.

 

నటీనటుల పనితీరు :

కమెడియన్ గా తనకంటూ ఓ సెపరేట్ మార్క్ సంపాదించుకొని ఎన్నో క్యారెక్టర్స్ తో ఎంటర్టైన్ చేసిన సప్తగిరి హీరోగా మరో సారి పరవాలేదనిపించుకున్నాడు. కొన్ని సందర్భాలలో ఓవర్ అనిపించినా ఎమోషనల్ సీన్స్ లో ఆకట్టుకున్నాడు. కశిష్‌ వోరా తన గ్లామర్ తో ఆకట్టుకుంది.ఇక హిందీలో బోమన్ ఇరానీ చేసిన క్యారెక్టర్ లో తన పెర్ఫార్మెన్స్ తో సినిమాకు హైలైట్ గా నిలిచాడు సాయి కుమార్. షకలక శంకర్ తన కామెడీ టైమింగ్ తో అక్కడక్కడా ఎంటర్టైన్ చేశాడు. శివప్రసాద్ ఒరిజినల్ క్యారెక్టర్ తో పోలిస్తే కొన్ని సన్నివేశాల్లో తేలిపోయాడనిపిస్తుంది. గొల్లపూడి మారుతి రావు, ఎల్.బి.శ్రీరామ్ వారి క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించుకుని సినిమాకు ప్లస్ అయ్యారు. నిర్మాత రవి కుమార్ నటుడిగా పరవాలేదనిపించుకున్నాడు. ఇక కోటా శ్రీనివాసరావు, పరుచూరి వెంకటేశ్వరరావు, జయప్రకాష్ రెడ్డి, రఘు బాబు, శేషు, జాన్సీ, మహేష్ ఆచంట, జబర్దస్త్ కార్తీక్ తదితరులు తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు.

 

టెక్నీషియన్స్ పనితీరు :

సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ లో ముందుగా మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ గురించే.. తన మ్యూజిక్ తో సినిమాకు హైలైట్ గా నిలిచాడు విజయ్‌ బుల్గానిన్‌. టైటిల్ సాంగ్’ఏమయింది..’ పాటలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘ఏమయింది.. ఏమయింది’.. అంటూ రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం, ఖైలాష్ ఖర్ పాడటంతో ‘ఏమయింది’ సాంగ్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. కందికొండ, సురేష్, లక్ష్మి ప్రియాంక సాహిత్యం బాగుంది. సారంగం ఎస్‌.ఆర్‌ సినిమాటోగ్రఫీ బాగుంది.  గౌతం రాజు ఎడిటింగ్ పరవాలేదనిపించింది. కొన్ని సందర్భాలలో వచ్చే పరుచూరి బ్రదర్స్ మాటలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రైతుల గురించి వచ్చే ఎమోషనల్ డైలాగ్స్ అందరినీ ఆలోచింపజేసేలా ఉన్నాయి. సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 

జీ సినిమాలు సమీక్ష :

తెలుగులో ఓ రీమేక్ సినిమా వస్తుందంటే దానిపై ఓ మోస్తరు అంచనాలుంటాయి. నిజానికి దర్శకనిర్మాతలు సేఫ్ జోన్ లో ఉండడానికే రీమేక్స్ ఎంచుకుంటారన్నది అందరికీ తెలిసిన విషయమే.. కానీ మన తెలుగులో రీమేక్ సినిమాలు సూపర్ హిట్ సాధించడం కాస్త అరుదే… టాలీవుడ్ లో సూపర్ హిట్స్ సాధించిన రీమేక్ సినిమాలు వేళ్ళ పై  లెక్కపెట్టొయొచ్చు.

ఇక ఈ సినిమా విషయానికొస్తే.. రామ్ చరణ్, సుకుమార్, నాని ఇలా కొందరు ఈ సినిమాను ప్రమోట్ చేయడం, ట్రైలర్, సాంగ్స్ అందరినీ ఎట్రాక్ట్ చేయడంతో సినిమా రిలీజ్ కి ముందే పాజిటీవ్ టాక్ అందుకుంది. అయితే ఒరిజినల్ సినిమాతో పోలిస్తే తెలుగులో కమర్షియల్ హంగుల కోసం కోసం చేసిన కొన్ని మార్పులు సినిమాకు పెద్ద మైనస్ అనిపిస్తుంది. కో డైరెక్టర్ గా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ దర్శకుడు చరణ్ లక్కాకుల పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ చేయలేకపోయాడనిపిస్తుంది.

సప్తగిరి క్యారెక్టర్, సాయి కుమార్ పెర్ఫార్మెన్స్, సెకండ్ హాఫ్ లో రైతులపై వచ్చే ఎమోషనల్ సీన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, కోర్ట్ సీన్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ సినిమాకు హైలైట్స్ గా నిలవగా.. ఫస్ట్ హాఫ్ లో ఓవర్ అనిపించే సప్తగిరి పెర్ఫార్మెన్స్, బోర్ కొట్టించే సీన్స్, సందర్భం లేకుండా వచ్చే సాంగ్స్ సినిమాకు మైనస్.. ఓవరాల్ గా సప్తగిరి ఎల్.ఎల్.బి పరవాలేదపిస్తుంది.

రేటింగ్ : 2.5 / 5