'జవాన్' రివ్యూ

Friday,December 01,2017 - 12:54 by Z_CLU

నటీ నటులు : సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్, ప్రసన్న,సుబ్బరాజు, కోట శ్రీనివాసరావు, జయప్రకాశ్, సత్యం రాజేష్ తదితరులు

మ్యూజిక్ : ఎస్.ఎస్. థమన్

సమర్పణ : దిల్ రాజు

నిర్మాత : కృష్ణ

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : బి.వి.ఎస్.రవి

రిలీజ్ డేట్ : 1 డిసెంబర్ 2017

 

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా బి.వి.ఎస్ రవి డైరెక్షన్ లో ‘జవాన్’ అనే టైటిల్ తో తెరకెక్కిన యాక్షన్ & ఫామిలీ ఎంటర్టైనర్ జవాన్ ఈరోజే థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చింది. దేశం మీద గౌరవం , కుటుంబం మీద ప్రేమ అనే అంశాలతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేస్తుందో..తెలుసుకుందాం.


కథ :

చిన్నతనం నుంచి తండ్రి మంచితనాన్ని పుణికి పుచ్చుకొని దేశం మీద భక్తి తో మంచి పౌరుడిగా పెరిగి పెద్దవుతాడు జై(సాయి ధరమ్ తేజ్)… అయితే ఎప్పటి కైనా డి.ఆర్.డి.ఓ లో సైన్టిస్ట్ గా ఉద్యోగం సంపాదించి దేశానికి తన వంతుగా ఏదో చేయాలనుకుంటాడు జై.. ఎట్టకేలకి తన టాలెంట్ తో డి.ఆర్.డి.ఓ లో సైన్టిస్ట్ గా ఉద్యోగం సంపాదిస్తాడు జై. ఈ క్రమంలో భారతదేశ ఆర్మీ కోసం డి.ఆర్.డి.ఓ లో సైన్టిస్టులు తయారు చేసిన ఆక్టోపస్ అనే ఓ మిస్సైల్ ను విదేశానికి అందించేట్టుగా ఓ ముఠాతో డీల్ కుదుర్చుకుంటాడు కేశవ్( ప్రసన్న)… అయితే జై ను అడ్డుపెట్టుకొని ఎంతో పవర్ ఫుల్ మిస్సైల్ అయిన ఆక్టోపస్ ను సొంతం చేసుకొని ఆ ముఠాకి అందించాలని చూస్తుంటాడు కేశవ్… ఈ క్రమంలో ఆక్టోపస్ ను అందుకోవడానికి జై కుటుంబాన్ని అడుపెట్టుకుంటూ ఆ మిస్సైల్ సిస్టమ్ ను అందించాల్సిందిగా జై పై ఒత్తిడి చేస్తుంటాడు కేశవ్. ఇంతకీ కేశవ్ ఎవరు..? జై కి కేశవ్ కి సంబంధం ఏమిటి…. దేశ సంపదను కాపాడుకునే క్రమంలో జవాన్ లా మారిన జై చివరికి కేశవ్ నుండి ఆక్టోపస్ తో పాటు తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు. అనేది మిగతా కథ.

 

నటీనటుల పనితీరు :

తన ఎనర్జిటిక్ యాక్టింగ్ తో ప్రతీ సినిమాకు హైలైట్ గా నిలుస్తున్న సాయి ధరమ్ తేజ్ మరో సారి జై క్యారెక్టర్ తో మెస్మరైజ్ చేశాడు. ముఖ్యంగా దేశం కోసం పోరాడే పాత్రతో తనలోని మరో యాంగిల్ బయటపెట్టి సినిమాకు హైలైట్ గా నిలిచాడు. మెహ్రీన్ తన గ్లామర్ తో ఆకట్టుకుంది. ప్రసన్న స్టైలిష్ విలన్ గా సినిమాకు ప్లస్ అయ్యాడు. కొన్ని సందర్భాలలో తన యాక్టింగ్ తో అరవింద్ స్వామిని గుర్తుచేశాడు. ఇక కోట శ్రీనివాస రావు, నాగ బాబు, జయప్రకాశ్, ఈశ్వరీ రావ్ సత్యం రాజేష్ తదితరులు తమ క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించుకున్నారు.

 

టెక్నిషియన్స్ పనితీరు :

సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ లో ముందుగా మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించే.. సాంగ్స్ తో పరవాలేదనిపించుకున్నా,  తన బాగ్రౌండ్ స్కోర్ తో సినిమాకు పెద్ద ఎస్సెట్ గా నిలిచాడు. ముఖ్యంగా కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ను తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో బాగా ఎలివేట్ చేశాడు థమన్. ‘ఇంటికి ఒక్కడు కావాలి’,’బుగ్గంచు’,’బంగారం’ పాటలు ఆకట్టుకున్నాయి. భాస్కర భట్ల, కృష్ణ కాంత్, శ్రీమణి అందించిన లిరిక్స్ బాగున్నాయి. ఎడిటింగ్ పరవాలేదు. ఆర్ట్ వర్క్ బాగుంది. కొన్ని సందర్భాలలో వచ్చే డైలాగ్స్ ఎంటర్టైన్ చేశాయి. ముఖ్యంగా ‘లైఫ్ లో మనం ఏదయినా మిస్ అయితే… దానర్ధం మనం దేనికి పనికి రామని కాదు… మనం ఇంకా దేనికో పనికొస్తామని’ అంటూ ఓ సందర్భంలో జయప్రకాశ్ చెప్పే డైలాగ్ ‘దేశానికి మన అవసరం పడ్డప్పుడు… నాది నేను అన్న పదాలు పక్కన పెట్టి దూకెయ్యాలి’,’యుద్ధం మొదలయ్యాక పక్కోడు పోయాడా… వెనకోడు ఆగిపోయాడా… ముందోడు కూలిపోయాడా కాదురా… యుద్ధం గెలిచామా లేదా అన్నదే ముఖ్యం’ అంటూ సాయి ధరమ్ తేజ్ చెప్పే పవర్ డైలాగ్స్  హైలైట్ గా నిలిచాయి. బి.వి.ఎస్ రవి సెలెక్ట్ చేసుకున్న కథ రొటీనే అయినప్పటికీ స్క్రీన్ ప్లే బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.


జీ సినిమాలు సమీక్ష :

వాంటెడ్ సినిమాతో దర్శకుడిగా మారిన రచయిత బి.వి.ఎస్.రవి చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ ఓ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడని, అందులో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నాడని, దిల్ రాజు సమర్పణలో సినిమా తెరకెక్కుతోందని తెలియగానే ‘జవాన్’ పై ఓ మోస్తరు అంచనాలు నెలకొన్నాయి. ఇక ఎన్టీఆర్  క్లాప్ తో స్టార్ట్ అయిన ఈ సినిమా, రిలీజ్ వరకు పాజిటివ్ బజ్ తోనే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇక సినిమా విషయానికొస్తే… మన దేశ సంపదను ఎవరో విదేశీయులు దోచుకోవాలనుకునే సందర్భం వచ్చ్చినప్పుడూ, ఇంటికొక్కడు ఓ జవాన్ లా మారాలి అనే కాన్సెప్ట్ బాగుంది అనిపించినప్పటికీ, ఇలాంటి కథలు చూసేశాం కదా అనే భావన కలుగుతుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు తన స్క్రీన్ ప్లే తో మేజిక్ చేస్తూ ఎంటర్టైన్ చేసిన దర్శకుడు రవి సెకండ్ హాఫ్ లో కాస్త తడబడ్డాడనే చెప్పాలి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో  ట్విస్ట్ లతో పాటు బలమైన సీన్స్ లేకపోవడంతో సెకండ్ హాఫ్ అంతా సాదా సీదాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో ఇంకాస్త శ్రద్ధ చూపించి ఉంటే సినిమా ఇంకా బాగుండేది అనిపించింది. కాని యువతకి ఓ మెసేజ్ అందిస్తూనే కథలో అన్ని కమర్షియల్ హంగులు ఉండేలా చూసుకున్నాడు రవి. అవి ఫాన్స్ ని బాగా ఎట్రాక్ట్ చేస్తాయి.

సాయి ధరమ్ తేజ్ పెర్ఫామెన్స్, ప్రసన్న విలనిజం, బ్యాగ్రౌండ్ స్కోర్, సాంగ్స్ పిక్చరైజేషన్, ‘బుగ్గంచు’ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్, సాయి ధరమ్ తేజ్ డాన్సులు, ఫైట్స్, ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ సీన్స్, సాయి ధరమ్ తేజ్-మెహ్రీన్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ గా నిలవగా… సెకండ్ హాఫ్ లో కాస్త రొటీన్ అనిపిస్తూ బోర్ కొట్టించే సీన్స్, హీరో – విలన్ మధ్య నడిచే మైండ్ గేమ్, వీక్ అనిపించే క్లైమాక్స్, కథ -కథనం సినిమాకు మైనస్.. ఫైనల్ గా దేశ సంపదను కాపాడే ఓ పౌరుడిగా ‘జవాన్’ ఎంటర్టైన్ చేస్తాడు.

 

రేటింగ్ : 2.75 /5