'ఆఫీసర్' మూవీ రివ్యూ

Friday,June 01,2018 - 03:38 by Z_CLU

నటీ నటులు : నాగార్జున, మైరా సరీన్, ఫెరోజ్ అబ్బాసి, బేబీ కావ్య , అజయ్ తదితరులు.

ఛాయాగ్రహణం : భరత్ వ్యాస్, రాహుల్ పెనుమత్స

సంగీతం : రవి శంకర్

నిర్మాతలు : రామ్ గోపాల్ వర్మ , సుదీర్ చంద్ర

నిర్మాణం : కంపనీ నిర్మాణం

కథ -స్క్రీన్ ప్లే -దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ

రిలీజ్ డేట్ : జూన్ 1, 2018

సెన్సార్ : U/A

 

నాగార్జున -రాం గోపాల్ వర్మ కాంబినేషన్ లో కాప్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ‘ఆఫీసర్’ ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా..? నాగ్-వర్మ కంబో ఈ సినిమాతో హిట్ అందుకుందా …? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

 

కథ :

ముంబైలో ప‌సారి నారాయణ్ అనే పోలీస్ ఆఫీస‌ర్ ఓ కేస్ లో ఇరుక్కుంటాడు.. ఆ కేస్ ను స్ట‌డీ చేయ‌డానికి హైద‌రాబాద్ నుంచి శివాజీ రావ్(నాగార్జున) ను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా నియమిస్తుంది హై కోర్ట్. అలా ముంబై వెళ్ళిన శివాజీ ప‌సారినే అండ‌ర్ వ‌రల్డ్ తో క‌లిసి అక్రమాలు చేస్తున్నాడని తెలుసుకుంటాడు. కానీ స‌రైన సాక్ష్యాలు లేక ప‌సారిని వ‌దిలేస్తుంది కోర్ట్. ఆ త‌ర్వాత అదే మాఫియాతో లింకులు పెట్టుకున్నాడంటూ శివాజీ పై నిందవేస్తారు. దాన్నుంచి శివాజీ ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు చివరికి పసారి ని ఎలా అంతమొందించాడు అనేది మిగతా క‌థ‌.

 

నటీనటుల పనితీరు :

ఇప్పటికే కొన్ని పోలిస్ క్యారెక్టర్స్ తో ఎంటర్టైన్ చేసిన నాగార్జున మరోసారి పోలిస్ ఆఫీసర్ గా ఉన్నంతలో మెస్మరైజ్ చేసాడు. ఇక మైరా సరీన్ తన గ్లామరస్ పెర్ఫార్మెన్స్ తో సినిమాకు ప్లస్ అయ్యింది. ఫెరోజ్ అబ్బాసి కేవలం వర్మ విలన్ లా మాత్రమే కనిపించాడు తప్ప తన విలనిజంతో ఆకట్టుకోలేకపోయాడు. బేబీ కావ్య తన నటనతో ఆకట్టుకుంది. ఇక సాయాజీ షిండే, అజయ్ తదితరులు నిమిత్త పాత్రలుగా మిగిలిపోయారే తప్ప  సినిమాకు పెద్దగా ప్లస్ అవ్వలేదు.

 

టెక్నిషియన్స్ పనితీరు :

తన ప్రతీ సినిమాకు టెక్నికల్ గా ఏదో ఒక ప్రయోగం చేసే వర్మ ఈ సారి కొన్ని ప్రయోగాలు చేసాడు. ముఖ్యంగా సరికొత్త సౌండ్ సిస్టం అంటూ మేజిక్ చేద్దామనుకున్నాడు. కానీ అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సినిమాటోగ్రఫీ…మ్యూజిక్…ఎడిటింగ్ ఇలా అన్నీ వర్మ రెగ్యులర్ ఫార్మేట్ లోనే ఉంటూ రొటీన్ అనిపించాయి. వర్మ కథ- స్క్రీన్ ప్లే కూడా రొటీన్ గానే అనిపిస్తూ బోర్ కొట్టించాయి. కంపనీ ప్రొడక్షన్ వాల్యూస్ పెద్దగా కనిపించలేదు.

జీ సినిమాలు రివ్యూ:

నాగార్జున -వర్మ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ‘శివ’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో…అందరికీ తెలిసిందే. అప్పటి వరకూ వచ్చిన తెలుగు సినిమాల్లో శివ ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఆ సినిమా తర్వాత నాగ్-వర్మ కలిసి ‘గోవిందా గోవిందా’, ‘అంతం’ సినిమాలు ఆ మేజిక్ రిపీట్ చేయలేక బోల్తా కొట్టాయి. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అయినా ఆ మేజిక్ రిపీట్ చేస్తుందని ఎదురుచూసిన ఫాన్స్ ని మళ్ళీ నిరాశే మిగిలింది.

ప్రారంభం నుండే పెద్దగా ఆసక్తి కలిగించలేకపోయిన ఈ సినిమా ప్రేక్షకులను కనీసం కొంత మేరకూ అయినా ఎంటర్టైన్ చేయలేకపోయింది. ఫస్ట్ హాఫ్ అంతా ఏదో అలా సాగిన ఈ సినిమా సెకండ్ హాఫ్ లో అయినా ఊపందుకుంటుందేమో అనుకుంటే మళ్ళీ అవే సాదా సీన్స్ తో బోర్ కొట్టించింది. ఒకానొక సమయంలో అసలు ఈ టైంలో నాగ్ ఈ సినిమా చేయడం అవసరమా..? అనే సందేహం కూడా ప్రేక్షకులకు కలుగుతుంది.

ఇక ఓపెనింగ్ రోజు తనలో జ్యూస్ అయిపోలేదని అది ఈ సినిమాతో నిరుపిస్తానని చెప్పుకొచ్చిన వర్మ ఎప్పటిలాగే ఆ మాటను గాలికొదిలేసాడు. స్టార్టింగ్ నుండే సినిమా ఏదో అలా సాగడం..గ్రాఫ్ పెంచే సీన్ ఒక్కటీ లేకపోవడం, తండ్రి కూతుళ్ళ మధ్య ఎమోషన్ పండకపోవడం, కొన్ని సందర్భాల్లో చిరాకు తెప్పించే సీన్స్ సినిమాకు పెద్ద మైనస్.

 

ప్లస్ పాయింట్స్ :

నాగార్జున

సినిమాటోగ్రఫీ

ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు

మైరా సరీన్ గ్లామర్

మైనస్ పాయింట్స్ :

కథ -స్క్రీన్ ప్లే

విలన్

బలమైన సీన్స్ లేకపోవడం

డ్రాగ్ అనిపించే సెకండ్ హాఫ్

ప్రీ క్లైమాక్స్ – క్లైమాక్స్ ఎపిసోడ్స్

రేటింగ్ : 2 / 5