'కాలా' మూవీ రివ్యూ

Thursday,June 07,2018 - 03:20 by Z_CLU

నటీ నటులు : రజిని కాంత్ , ఈశ్వరీ రావు, హుమా ఖురేషి, నానా పటేకర్, సముద్రఖని, సంపత్ తదితరులు

సినిమాటోగ్రఫీ : మురళి.జి

మ్యూజిక్ : సంతోష్ నారాయణ్

నిర్మాణం : వండర్ బార్ ఫిలిమ్స్

నిర్మాత : ధనుష్

దర్శకత్వం : పా.రంజిత్

విడుదల తేది : జూన్ 7 ,2018

సెన్సార్ : U/A

 

సూపర్ స్టార్ రజిని కాంత్ సినిమా వస్తుందంటే… ఓ నెల ముందు నుండే హంగామా మొదలవ్వడం.. వారం ముందే ప్రేక్షకులు టికెట్స్ కోసం థియేటర్స్ లో క్యూ కట్టడం… రిలీజ్ కి ముందు ఎక్కడ చూసినా..విన్నా సూపర్ స్టార్ సినిమా గురించే మాట్లాడుకోవడం… కామన్. కానీ ఇవన్నీ లేకుండానే రజిని నటించిన ‘కాలా’ సినిమా థియేటర్స్ లోకొచ్చింది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘కాలా’ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిందా… సూపర్ స్టార్ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడా… జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.


కథ :

తిరునల్వేలి నుండి ముంబైకి బ్రతుకుతెరువు కోసం ముంబై వచ్చి ధారావి అనే వాడలో స్థిరపడిన వీరయ్య కొడుకు కరికాలా అలియాస్ ‘కాలా’… ఆ వాడకి లీడర్ గా ఉంటూ కొందరు కార్పోరేట్ కంపనీల నుండి …రాజకీయ నాయకుల నుండి క్లీన్ ముంబై పేరుతో కబ్జా అవ్వకుండా కాపాడుకుంటూ వస్తాడు. సరిగ్గా అదే సమయంలో విదేశాల్లో నుండి ధారవి డెవలప్ మెంట్ చేయడానికి కాలా మాజీ ప్రియురాలు జరీన(హుమా ఖురేషి) ముంబై వస్తుంది… మినిస్టర్ హరిదాదా కుట్ర తెలియకపోవడంతో అతని వ్యక్తులతో కలిసి ధారవి కోసం పాటుపడుతుంది. ఇక తన కుటుంబం కంటే తను నివసించే ధారవినే ఎక్కువగా ప్రేమించే కాలా ఓ సందర్భంలో మినిస్టర్ హరిదాదా(నానా పటేకర్) కి ఎదురెలతాడు. ఈ క్రమంలో తన భార్య స్వర్ణ(ఈశ్వరి రావు) అలాగే కొడుకు శివాజీ(అరవింద్ ఆకాష్) ను కూడా పోగుట్టుకుంటాడు. అయినా లెక్కచేయని కాలా ధారవి కోసం గవర్నమెంట్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తాడు. చివరికి ఈ పోరాటంలో కాలా గెలిచాడా… లేదా అనేది మిగతా కథ.

 

నటీనటుల పనితీరు :

కాలా క్యారెక్టర్ లో సూపర్ స్టార్ సూపర్ అనిపించుకున్నాడు. ముఖ్యంగా మాసీ లుక్ తో మెస్మరైజ్ చేసాడు. తన పెర్ఫార్మెన్స్ తో వన్ మెన్ షో అనిపించాడు రజిని. ఈశ్వరీ రావు భార్య పాత్రలో ఒదిగిపోయింది. నానా పటేకర్ తన పరిధిలో నటించి సినిమాకు ప్లస్ అయ్యాడు. బావగా సముద్రఖని, కొడుకుగా అరవింద్ ఆకాష్ ఆకట్టుకున్నారు. నటిగా అంజలి బెస్ట్ అనిపించుకుంది. సాయాజీ షిండే, సంపత్ రాజ్,ఆరుళ్ దాస్,రవి కాలే,పంకజ్ త్రిపాటి తదితరులు తమ క్యారెక్టర్స్ తో పరవాలేదని పించుకున్నారు.

 

టెక్నీషియన్స్ పనితీరు :

సంతోష్ నారాయణ్ మ్యూజిక్ పరవాలేదు.. ముఖ్యంగా కొన్ని సందర్భాలలో అతని బాగ్రౌండ్ స్కోర్ సినిమాను ఎలివేట్ చేసింది. కొన్ని సందర్భాల్లో వెస్టర్న్ రాప్ మ్యూజిక్ తో చిరాకు తెప్పించాడు. ‘కాలా’ టైటిల్ సాంగ్’ , ‘రావే నా నా రంగేళి లా’,’చిట్టెమ్మా’ పాటలు మినహా మిగతా పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. రామ లింగం ఆర్ట్ వర్క్ బాగుంది. చాలా సందర్భాల్లో తన ఆర్ట్ వర్క్ ముంబై లోని స్లం అట్మా స్పియర్ తీసుకొచ్చారు. సినిమాటోగ్రఫీ బాగుంది. రజిని కొత్తగా చూపించడంలో , కొన్ని షాట్స్ లో సినిమాటోగ్రాఫర్ మురళి తన కెమెరా పనితనం చూపించాడు. కొన్ని సందర్భాల్లో వచ్చే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. పా.రంజిత్ స్క్రీన్ ప్లే -డైరెక్షన్  వీక్ అనిపిస్తాయి. వండర్ బార్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ వాల్యూస్ పరవాలేదు.

 

జీ సినిమాలు రివ్యూ :

ఓ స్టార్ హీరో యంగ్ డైరెక్టర్ ను నమ్మి మరో చాన్స్ ఇవ్వడం మామూలు విషయం కాదు… అందులోకి ‘కబాలి’ వంటి అపజయం తర్వాత కూడా మళ్ళీ ఆ దర్శకుడికి సూపర్ స్టార్ మరో అవకాశం ఇవ్వడం చర్చనీయాంశం అయింది. ఫ్లాప్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు కూడా పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. కానీ సూపర్ స్టార్ రజిని రంజిత్ నమ్మి మరో చాన్స్ ఇవ్వడం, ముంబై లోని స్లంలో జరిగే కథ కావడం, రజిని లుక్ ఎట్రాక్ట్ చేయడం ‘కాలా’ పై ఓ మోస్తరు అంచనలు నెలకొలిపాయి. ఆ మోస్తరు అంచనాలతో ఎటువంటి హంగామా లేకుండానే ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చింది.

రంజిత్ కి సూపర్ స్టార్ మరో చాన్స్ ఇచ్చినప్పుడు గత సినిమాలో చేసిన తప్పులు రిపీట్ చేయకుండా జాగ్రత్త పడాలి…కానీ ఈ సినిమాలో మళ్ళీ అవే తప్పులు రిపీట్ చేసాడు రంజిత్. ముఖ్యంగా  ర్యాప్ థీమ్స్ ను  రిపీట్ చేయడం లాంటివి… పైగా రజిని ఎంట్రీ సాదా సీదా హీరో ఎంట్రీలా ఉండటం, కొన్ని సందర్భాల్లో మాత్రమే హీరో ఇజాన్ని ఎలివేట్ చేయడం అభిమానుల్ని  నిరుత్సాహపరుస్తుంది. రజిని లుక్, కొన్ని సీన్స్, ప్రీ ఇంటర్వెల్ ఫైట్, ఇంటర్వెల్ బ్యాంగ్ తో ఫస్ట్ హాఫ్ పరవాలేదనిపించిన దర్శకుడు… సెకండ్ హాఫ్ లో మాత్రం సినిమాను కాస్త సాగ దీసి  బోర్ కొట్టించాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ప్రేక్షకుడికి విసుగు తెప్పిస్తాయి. సెకండ్ హాఫ్ లో కొన్ని జాగ్రత్తలు తీసుకుని, ప్రీ ఇంటర్వెల్ లాంటి ఫైట్ ఒకటి అలాగే  మైండ్ గేంతో సాగే సీన్స్  కొన్ని పెడితే బాగుండేది.

సినిమా గ్రాఫ్ చూసుకుంటే సెకండ్ హాల్ఫ్ లో తన కుటుంబంలో ఇద్దరిని పోగుట్టుకున్న కాలా మినిస్టర్ దగ్గరికి వెళ్లి వార్నింగ్ ఇచ్చే సన్నివేశం నుండి సినిమా గ్రాఫ్ పడిపోయింది. అక్కడి నుండి ఇక ఊపందుకోకపోవడం సినిమాకు పెద్ద మైనస్. కథాంశం బాగున్నప్పటికీ కథతో పూర్తి స్థాయిలో ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేయలేకపోయాడు రంజిత్. కొన్ని సందర్భాల్లో దర్శకుడు సూపర్ స్టార్ ను సరిగ్గా వాడుకోలేదేమో అనిపిస్తుంది. హీరో ఇజం ను ఎలివేట్ చేసే స్కోప్ ఉన్నప్పటికీ దానిపై పెద్దగా దృష్టి పెట్టలేదు రంజిత్. ఒక సామాజిక అంశాన్ని కమర్షియల్ ఆంగిల్ లో తెరకెక్కించడంలో అక్కడక్కడా తడబడ్డాడు.

 

ప్లస్ పాయింట్స్ :

రజిని కాంత్

ఆర్ట్ వర్క్

ప్రీ ఇంటర్వెల్ ఫైట్

ఇంటర్వెల్ బ్యాంగ్

కొన్ని కామెడి సీన్స్

 

మైనస్ పాయింట్స్ :

స్లో నెరేషన్

బాగ్రౌండ్ స్కోర్

సాంగ్స్

రాప్ థీమ్స్

లెంగ్త్

ప్రీ క్లైమాక్స్ – క్లైమాక్స్

 

రేటింగ్ : 2.75/ 5