కథనం మూవీ రివ్యూ

Friday,August 09,2019 - 04:07 by Z_CLU

నటీనటులు: అన‌సూయ, అవ‌స‌రాల, ర‌ణ‌ధీర్‌, ధ‌న్‌రాజ్‌, వెన్నెల‌కిషోర్‌, పెళ్లి పృధ్వీ, స‌మీర్‌, ముఖ్తార్‌ఖాన్‌, రామ‌రాజు, జ్యోతి త‌దిత‌రులు
ఎడిట‌ర్ఃఎస్‌.బి. ఉద్ద‌వ్‌
మ్యూజిక్ః రోషన్ సాలూరి
ఆర్ట్ డైరెక్ట‌ర్ః కె.వి.ర‌మ‌ణ‌
రచయిత : రాజేంద్ర భరద్వాజ్
డైరెక్ట‌ర్ ఆఫ్ ఫొటోగ్ర‌ఫీః స‌తీష్ ముత్యాల‌
నిర్మాత‌లుః బి.న‌రేంద్ర‌రెడ్డి, శ‌ర్మ చుక్కా
క‌థ‌, స్క్రీన్‌ప్లే,ద‌ర్శ‌క‌త్వంః రాజేష్ నాదెండ్ల‌
రిలీజ్ డేట్ : ఆగస్ట్ 9, 2019

ఇప్పటి వరకూ తనకి పర్ఫెక్ట్ అనిపించే క్యారెక్టర్స్ తో మెస్మరైజ్ చేసిన అనసూయ ఇప్పుడు హీరోయిన్ గా మారి ‘కథనం’ అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమా చేసింది. మరి అనసూయ కథనం ఆకట్టుకుందా…? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ.

కథ

సినిమా డైరెక్టర్ అవ్వాలనుకునే అను(అనసూయ) కొన్ని కథలు సిద్ధం చేసుకొని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. దర్శకురాలు అవ్వాలని అను చేసిన ప్రతీ ప్రయత్నం విఫలం అవుతుంది. ఈ క్రమంలో తన స్నేహితుడు ధన(ధనరాజ్) తో పట్టువదలకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తుంది. ఎట్టకేలకు అనుకి కొందరు నిర్మాతల రూపంలో డైరెక్షన్ చేసే అవకాశం వస్తుంది. ఈ క్రమంలో అనుకి కొన్ని అనుకోని పరిణామాలు ఎదురవుతాయి. తను సినిమాకు కోసం రాసుకున్న కథలో జరిగిన హత్యలు నిజజీవితంలోనూ జరుగుతుంటాయి. చివరికి ఆ హత్యల వెనకున్న ఆ వ్యక్తులను అను ఎలా ఛేదించింది. అసలు ఆ హత్యలకు అనుకి సంబంధం ఏమిటనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు:

ఈ మధ్య కొన్ని ముఖ్య పాత్రలతో నటిగా మెప్పించిన అనసూయ ఈ సినిమాలో అను గా అరవిందగా రెండు క్యారెక్టర్స్ కి పూర్తి న్యాయం చేసింది. కొన్ని సన్నివేశాల్లో నటిగా మంచి మార్కులు అందుకుంది. సపోర్టింగ్ క్యారెక్టర్ లో ధన్ రాజ్ ఆకట్టుకున్నాడు. వెన్నెల కిశోర్ తన కామెడీ టైమింగ్ తో నవ్వించాడు. పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో రణదీర్ బాగా నటించాడు.

విలన్ గా పృథ్వి మంచి నటన కనబరిచారు. అవసరాల శ్రీనివాస్ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. మారుతి, సంపూ గెస్ట్ రోల్స్ లో మెరిసారు. సమీర్, జ్యోతి, శేషు, రామ్ జగన్, కోటేశ్వరరావు పరవాలేదు
అనిపించుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు:

సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీతం పరవాలేదు. కొన్ని సందర్భాల్లో వచ్చే నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. అనుకున్న కథను పర్ఫెక్ట్ గా ఎడిట్ చేశారు. సింధు కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ ప్లస్ అయ్యాయి. కొన్ని పాత్రలకు డబ్బింగ్ కుదరలేదు. కథ -కథనం కూడా రొటీన్ గానే ఉన్నాయి. డైరెక్షన్ వీక్. ప్రొడక్షన్ వాల్యూస్ లో-లెవెల్ అనిపించాయి.

 

జీ సినిమాలు సమీక్ష :

పన్నెండు కథలు రిజెక్ట్ చేసి మరీ ‘కథనం’ చేసిన అనసూయ పూర్తిగా మెప్పించలేకపోయింది. కథలో కొత్తదనం కనిపించలేదు. కథనం మాత్రం జస్ట్ పరవాలేదు అనిపిస్తుంది. ఈ కథతో ఇప్పటికే కొన్ని సినిమాలొచ్చాయి. కొన్ని సందర్భాల్లో వచ్చే సన్నివేశాలు గతంలో వచ్చిన కొన్ని సినిమాల్ని గుర్తు చేస్తాయి. మొదటి భాగంలో వచ్చే కామెడీ
సన్నివేశాలు ఓ మోస్తరుగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ నవ్విస్తుంది. రెండో భాగంలో వచ్చే ట్విస్టులు పెద్దగా ఆసక్తికరంగా లేవు. ఆ సన్నివేశాలను ఇంకా బాగా రాసుకోవాల్సింది.

తను రాసుకున్న కథకి సరైన కథనం రాసుకోవడంలో, దాన్ని తెరపై ఆసక్తి కరంగా తెరకెక్కించడంలో దర్శకుడిగా రాజేష్ విఫలం అయ్యాడు. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కొంత వరకూ ఆకట్టుకున్నప్పటికీ అరుంధతి ని గుర్తుచేస్తుంది. సినిమాలో వచ్చే కొన్ని సన్నివేశాలు, క్యారెక్టర్స్ ప్రేక్షకులను ఇబ్బంది పెడతాయి. క్లైమాక్స్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఉంటూ హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా రెండో భాగంలో అనసూయ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ తగ్గించి రణదీర్ క్యారెక్టర్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టాడు దర్శకుడు. అసలు కథలో కీలకమైన అను క్యారెక్టర్ ని తగ్గించగడం మైనస్ అనిపిస్తుంది. కానీ ప్రీ క్లైమాక్స్ లో దానికి సమాధానం చెప్పాడు. ఇవన్నీ సినిమాకు మైనస్.

ఫైనల్ గా క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘కథనం’ జస్ట్ పరవాలేదనిపిస్తుంది.

రేటింగ్2/5