'ఎవరు' మూవీ రివ్యూ

Thursday,August 15,2019 - 10:12 by Z_CLU

న‌టీన‌టులు : అడివిశేష్‌, రెజీనా కసండ్ర‌, న‌వీన్ చంద్ర, పోసాని, నిహాల్ త‌దిత‌రులు

ఛాయాగ్రహణం : వ‌ంశీ ప‌చ్చిపులుసు

సంగీతం: శ‌్రీచ‌ర‌ణ్ పాకాల‌

ఎడిటింగ్‌:  గ్యారీ బి.హెచ్‌

డైలాగ్స్‌:  అబ్బూరి ర‌వి

సౌండ్ ఎఫెక్ట్స్‌:  య‌తిరాజ్‌

నిర్మాత‌లు :  పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె

ద‌ర్శ‌క‌త్వం :  వెంక‌ట్ రామ్‌జీ

నిడివి : 117 నిమిషాలు

విడుదల తేది : 15 ఆగస్ట్ 2019

‘క్షణం’ , ‘గూఢచారి’ సినిమాలతో హీరోగా మంచి విజయాలు అందుకున్న అడివి శేష్ ఇప్పుడు మరో థ్రిల్లర్ సినిమా ‘ఎవరు’ తో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేసి మెప్పించిందా…? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ.


కథ :

కూనూర్ (తమిళ్ నాడు)లో సమీరా(రెజీనా) అశోక్(నవీన్ చంద్ర) చేత రేప్ చేయబడుతుంది. తనను తాను కాపాడుకునే క్రమంలో అశోక్ ని హత్య చేస్తుంది. ఆ హత్య కేసులో సమీరాను అరెస్ట్ చేస్తారు. అయితే బెయిల్ మీద బయటికొచ్చిన సమీరాకు డబ్బు కోసం ఏదైనా చేసే సబ్ ఇన్స్పెక్టర్ విక్రమ్ వాసుదేవ్( అడివి శేష్) సహాయం చేయడానికి తనను కలిస్తాడు.

ఈ క్రమంలో అశోక్ ని ఏ పరిస్థితుల్లో హత్య చేయాల్సి వచ్చిందని సమీరాని అడిగి తెలుసుకుంటాడు విక్రమ్. అలా ఆ హత్య గురించి సమీరా తో మాట్లాడిన విక్రమ్ కి కొన్ని విషయాలు తెలుస్తాయి. ఆ కేసు నుండి బయటపడేందుకు సమీరాకు ఐడియాలు ఇస్తాడు. అలా సమీరాకు సహాయం చేయాలన్న ఉద్దేశ్యంతో ఆ హత్య గురించి పూర్తి వివరాలు సేకరించిన విక్రమ్ వాసుదేవ్ చివరికి సమీరాను అశోక్ హత్య కేసు నుండి బయటపడేసాడా..? లేదా ? అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

తనకు సరిపడే క్యారెక్టర్స్ ఎంచుకుంటూ హీరోగా ముందుకెళ్తున్న అడివి శేష్ మరో సారి తన నటనతో మెప్పించాడు. కాకపోతే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో మాత్రం తెలిపోయాడు. రెజీనా కు నటించే స్కోప్ ఉన్న క్యారెక్టర్ లభించడంతో సమీరా రోల్ కి బెస్ట్ అనిపించుకుంది. కానీ కొన్ని సీన్స్ లో ఓవర్ మేకప్ తో ఇబ్బంది పెట్టింది. నవీన్ చంద్ర తన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. పాజిటీవ్ , నెగిటీవ్ రెండూ ఉన్న క్యారెక్టర్ లో ఓడిపోయాడు.

ఆదర్శ్ క్యారెక్టర్ లో నిహాల్ నటన బాగుంది. మురళి శర్మ ఎప్పటిలాగే బెస్ట్ అనిపించుకున్నాడు. ఆ క్యారెక్టర్ లో మరో నటుణ్ని ఊహించుకోలేం. పవిత్ర లోకేష్, సమీర్, శ్వేతా వర్మ, పమ్మి సాయి తదితరులు పరవాలేదనిపించుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు :

 థ్రిల్లర్ సినిమాలకు సరైన నేపథ్య సంగీతం పడాలి. లేదంటే సినిమాపై ఇంపాక్ట్ ఉండదు. సరిగ్గా శ్రీచరణ్ అలాంటి నేపథ్య సంగీతాన్నే సినిమాకు అందించి ఇంపాక్ట్ తీసుకొచ్చాడు. కొన్ని సందర్భాల్లో నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. వ‌ంశీ ప‌చ్చిపులుసు సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ కథకు తగినట్టుగా ఉన్నాయి. సౌండ్ ఎఫెక్ట్స్ బాగున్నాయి.  సినిమాకు ఎడిటింగ్ ప్లస్ పాయింట్. పర్ఫెక్ట్ టైమింగ్ మైంటైన్ చేసారు. అందువల్ల సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. అబ్బూరి రవి అందించిన మాటలు ఆకట్టుకున్నాయి. డెబ్యూ అయినప్పటికీ తన డైరెక్షన్ తో థ్రిల్ చేసాడు వెంకట్ రాంజీ. పీ.వి.పీ సినిమాస్ ప్రొడక్షన్స్ సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చాయి.


జీ సినిమాలు సమీక్ష :

క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘ఎవరు’ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే , ట్విస్టులతో ఆకట్టుకుంది. ‘క్షణం’, ‘గూఢచారి’ లాంటి సినిమాలతో తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అడివి శేష్ మరోసారి తనకి పర్ఫెక్ట్ అనిపించే థ్రిల్లర్ కథను ఎంచుకొని ప్రేక్షకులను మెప్పించాడు. కొత్త దర్శకుడైనప్పటికీ ప్రేక్షకులు ఊహించని ట్విస్టులతో చివరి వరకూ ఎంగేజ్ చేయగలిగాడు వెంకట్ రాంజీ.

ఒక రేప్ ఇంసిడెంట్ తో మొదలైన సినిమా పదినిమిషాలకు మర్డర్ మిస్టరీగా సాగుతుంది. ఆ తర్వాత ప్రేక్షకుడు ఊహించని విధమైన ట్విస్టులుంటాయి. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ప్రతీ సీన్ ఆసక్తిగా ఉంటుంది. స్క్రీన్ ప్లే సినిమాకు మెయిన్ హైలైట్.  అలాగే ఎడిటింగ్ కూడా బాగా కలిసొచ్చింది. థ్రిల్లర్ సినిమాలను పర్ఫెక్ట్ టైమింగ్ తో చెప్పెగలిగితే ఆడియన్స్ కచ్చితంగా ఎంగేజ్ అవుతారు. ‘ఎవరు’ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ ఎక్కడా బోర్ కొట్టకుండా స్క్రీన్ ప్లే మేజిక్ చేస్తుంది. ఇక నటీ నటులు కూడా సినిమాను తన నటనతో సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళారు. ముఖ్యంగా శేష్, రెజినా తమ నటనతో సినిమాను ముందుకు నడిపించి హైలైట్ గా నిలిచారు.

సినిమాలో రెజినా రేప్ సీన్ ఆ తర్వాత మర్డర్ సీన్  ఓ నాలుగు సార్లు వస్తుంది. ఎన్ని సార్లు రిపీట్ అయినా ఆ సీన్  బోర్ కొట్టదు. దానికి కారణం ప్రతీ సారి చూపించే కోణం మారుతుంది. అయితే ఆ వెర్షన్స్ లో ఏది నిజం అనేది తెలియాలంటే క్లైమాక్స్ వరకూ వెయిట్ చేయాల్సిందే.  సినిమాలో కేవలం థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ మాత్రమే కాదు తండ్రిపై కొడుకున్న ఎమోషనల్ సీన్స్  , రొమాంటిక్ సీన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.  అడివి శేష్ , రెజినా పర్ఫార్మెన్స్ , ఇంట్రెస్టింగ్ స్టోరీ  – గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే , థ్రిల్ కలిగించే సీన్స్ , ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ సినిమాకు హైలైట్స్ అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు కాస్త నెమ్మదిగా సాగుతాయి. అది మినహాయిస్తే సినిమాలో పెద్దగా మైనస్ లు కనిపించవు. ఫైనల్ గా ‘ఎవరు’ ఆడియన్స్ ను థ్రిల్ చేస్తుంది. బద్లా , ఇన్విసిబిల్ గెస్ట్ సినిమాలు చూడని వారికి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది.

రేటింగ్3/5