'కనుపాప' రివ్యూ

Friday,February 03,2017 - 10:42 by Z_CLU

రిలీజ్ : 3 -01-2017

నటీ నటులు : మోహన్ లాల్, విమలా రామన్

సినిమాటోగ్రఫీ : ఎన్.కె.ఏకాంబరం

మ్యూజిక్ : 4 మ్యూజిక్స్

కథ : గోవింద్ విజయన్

నిర్మాత : మోహన్ లాల్

స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ప్రియదర్శన్

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘ఒప్పమ్’. మలయాళంలో రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఘన విజయం అందుకున్న ఈ సినిమా తెలుగులో ‘కనుపాప’ టైటిల్ తో ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. ‘జనతా గ్యారేజ్’ సినిమాతో టాలీవుడ్ లో నటుడిగా ఎంట్రీ ఇచ్చి లేటెస్ట్ గా ‘మన్యం పులి’ అనే డబ్బింగ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మోహన్ లాల్… ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేసాడో? చూద్దాం.

 

కథ :

జయరామ్ (మోహన్ లాల్) అనే అంధుడు ఓ అపార్టెమెంట్ లో లిఫ్ట్ ఆప‌రేట‌ర్ గా వ‌ర్క్ చేస్తుంటాడు.  ఆ అపార్ట్ మెంట్ లో ఒక రోజు ఓ జడ్జ్  మ‌ర్డ‌ర్ జ‌రుగుతుంది. ఆ మ‌ర్డ‌ర్ చేసిన కిల్ల‌ర్ తప్పించుకొని నందిని (బేబీ మీనాక్షి) అనే ఓ పాప కోసం వెతుకుతుంటాడు .  ఇంతకీ ఆ జడ్జ్ ను ఎందుకు చంపాడు? ఆ పాప ఎవరు? ఆ పాపను ఆ కిల్లర్ ఎందుకు చంపాలనుకున్నాడు? చివరికి అంధుడైన జయరామ్ ఆ కిల్లర్ ని ఎలా అంతం చేసి  పాపను కాపాడాడు.. అనేది సినిమా కథాంశం..

నటీనటుల పనితీరు :

మోహన్ లాల్ మరోసారి జయరామ్  అనే అంధుడి క్యారెక్టర్ తో సినిమాకు హైలైట్ గా నిలిచాడు. మోహన్ లాల్ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నటుడు సముత్తర ఖని గురించే. ఓ విలన్ గా తనదైన నటనతో మంచి మార్కులు అందుకున్నాడు. శ్రీదేవి అనే క్యారెక్టర్ లో విమలా రామన్ కథానాయికగా మెప్పించింది. కమెడియన్ మము కొయ్య ఎంటర్టైన్ చేశాడు. ఇక బేబీ మీనాక్షి, అనుశ్రీ, వేణు, హరీష్, రాంజీ తదితరులు తమ క్యారెక్టర్స్ కి పూర్తి న్యాయం చేశారు.

 

టెక్నీషియన్స్ పని తీరు :

ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ గురించే. తన కెమెరా వర్క్ తో సినిమాకు మరింత అందం తీసుకొచ్చాడు కెమెరామెన్ ఏకాంబరం. 4 మ్యూజిక్స్ అందించిన సాంగ్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. రోన్ యోహాన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కొన్ని సన్నివేశాలను హైలైట్ చేసింది. గోవింద్ విజయన్ కథ బాగుంది. రాజశేఖర్ మాటలు ఆకట్టుకున్నాయి. స్టార్ డైరెక్టర్ గా ఇప్పటికే చాలా సినిమాలతో ఎంటర్టైన్ చేసిన దర్శకుడు ప్రియదర్శన్ మరోసారి తనదైన స్క్రీన్ ప్లేతో ఎంటర్టైన్ చేశాడు. ఎడిటింగ్ పరవాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 

జీ సినిమాలు సమీక్ష :

నటుడిగా తనకు పర్ఫెక్ట్ అనిపించే కథలను సెలెక్ట్ చేసుకుంటూ ఆ క్యారెక్టర్ లో ఇమిడిపోయి నటించే మోహన్ లాల్ మరోసారి అలాంటి కథనే ఎంచుకొని ఓ అంధుడి క్యారెక్టర్ తో  నటుడిగా శెభాష్ అనిపించుకున్నాడు. ఒక సింపుల్ పాయింట్ ను తనదైన స్క్రీన్ ప్లేతో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా మలిచాడు ప్రియదర్శన్. మోహన్ లాల్ క్యారెక్టర్, అపార్ట్మెంట్ లో జరిగే సస్పెన్స్ సీన్స్ , కామెడీ సీన్స్ , క్లైమాక్స్ సినిమాకు ప్లస్ గా నిలవగా కొన్ని సన్నివేశాల్లో స్లో స్క్రీన్ ప్లే సినిమాకు మైనస్ గా నిలిచింది. ఫైనల్ గా సస్పెన్స్ థ్రిల్లర్ తో కూడిన ఫీల్ గుడ్ మూవీగా ‘కనుపాప’ అందరినీ ఆకట్టుకుంటుంది. మరి మలయాళంలో సూపర్ హిట్  సాధించిన ఈ సినిమా  తెలుగులో ఎలాంటి విజయం అందుకుంటుందో? చూడాలి.

రేటింగ్ : 3 /5