'నేను లోకల్' రివ్యూ

Friday,February 03,2017 - 03:05 by Z_CLU

విడుదల : ఫిబ్రవరి 3, 2017

నటీనటులు : నాని, కీర్తి సురేష్, నవీన్ చంద్ర

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ : నిజార్ షఫీ

కథ – మాటలు- స్క్రీన్‌ప్లే : ప్రసన్న కుమార్ బెజవాడ

అసోసియేట్ ప్రొడ్యూసర్ : బెక్కెం వేణుగోపాల్

సహ నిర్మాత : హర్షిత్ రెడ్డి

సమర్పణ : దిల్ రాజు

నిర్మాత : శిరీష్

నిర్మాణం : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

దర్శకత్వం : త్రినాధరావు నక్కిన

హీరోగా వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని, ‘నేను శైలజ’ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కీర్తి సురేష్ జంటగా త్రినాథరావు నక్కిన ద‌ర్శ‌క‌త్వంలో శిరీష్ నిర్మాత‌గా తెరకెక్కిన చిత్రం `నేను లోక‌ల్‌`. “ఆటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్”…. అనే క్యాప్ష‌న్‌ తో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. మరి ‘నేను లోకల్’ అంటూ నాని ఎలా ఎంటర్టైన్ చేశాడు… మరో సూపర్ హిట్ అందుకున్నాడా… లేదా…

 

కథ :

బాబు (నాని) అనే కుర్రాడు తన పేరెంట్స్ కోసం ఎట్టకేలకు దొంగదారిలో తన గ్రాడ్యుయేషన్ పూర్తిచేస్తాడు. అలా గ్రాడ్యుయేట్ అయిపోయి ఖాళీగా ఉన్న బాబు… ఒకానొక సందర్భంలో కీర్తి(కీర్తి సురేష్) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. అలా ప్రేమలో పడిన బాబు తన నెక్స్ట్ పనులన్నింటినీ పక్కన పెడతాడు. కీర్తిపైనే పూర్తి ఫోకస్ పెట్టి ఆమె చదివే ఎంబీఏ కాలేజ్ లోనే జాయిన్ అయి.. ఎట్టకేలకి కీర్తిని తన ప్రేమలో పడేస్తాడు. బాబుకు కీర్తినిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేని కీర్తి తండ్రి(సచిన్ ఖేడేకర్) సబ్ ఇనస్పెక్టర్ సిద్దార్థ్ వర్మ(నవీన్ చంద్ర)తో కీర్తి పెళ్లి నిశ్చయిస్తాడు. చివరికి బాబు తన లోకల్ తెలివితేటలతో సిద్దార్థ్ వర్మని సైడ్ చేసి.. కీర్తి తండ్రిని ఎలా ఒప్పించాడు….తన ప్రేమని ఎలా దక్కించుకున్నాడనేది మిగతా బ్యాలెన్స్.

 

నటీనటుల పనితీరు :

ముందుగా ఈ సినిమాలో నాని గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. ఇప్పటి వరకూ కనిపించని ఓ డిఫరెంట్ యాటిట్యూడ్ లో కనిపించాడు. బాబు అనే మాస్ కుర్రాడి క్యారెక్టర్ లో ఫుల్ గా ఎంటర్ టైన్ చేశాడు. కీర్తి సురేష్ తన లుక్, యాక్టింగ్ తో సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. సిద్దార్థ్ వర్మ గా నవీన్ పర్ఫార్మెన్స్ బాగుంది. హీరోయిన్ తండ్రిగా సచిన్ ఖేడేకర్, హీరో తండ్రి క్యారెక్టర్ లో పోసాాని ఆకట్టుకున్నారు. మరీ ముఖ్యంగా నాని తండ్రిగా పోసాని తనదైన పంచ్ లతో బాగా ఎంటర్టైన్ చేశాడు. విలన్ గా రావురమేష్ మరోసారి ఆకట్టుకున్నాడు. ఇక కృష్ణ భగవాన్, వెన్నెల కిషోర్, రామ్ ప్రసాద్, పావలా శ్యామల తదితరులు తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు.

టెక్నీషియన్స్ పని తీరు

టెక్నీషియన్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది దేవిశ్రీప్రసాద్ గురించే.   సినిమాకు తన మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ తో హైలైట్ గా నిలిచాడు దేవి. ముఖ్యంగా చంద్రబోస్ లిరిక్స్ అందించిన ‘నెక్స్ట్ ఏంటి’ పాటతో పాటు శ్రీమణి రాసిన మిగతా అన్నీ సాంగ్స్ బాగున్నాయి. నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ బాగుంది. డైలాగ్స్ తో సినిమాకు హైలైట్ గా నిలిచాడు ప్రసన్న కుమార్ బెజవాడ. ‘మార్చ్-సెప్టెంబర్’ డైలాగుతో పాటు ‘పరిగెత్తి పరిగెత్తి ఆగే దాన్ని జింక అంటారు.. పరిగెత్తి పరిగెత్తి కొట్టేదాన్ని పులి అంటారు’ అనే డైలాగ్ తో పాటు “డబ్బు అందరికీ కావాలి కానీ డబ్బే కావాలనుకుంటే మాత్రం అమ్మ నాన్నలతో మాట్లాడడానికి కూడా టైం టేబుల్ వేసుకోవాలి”,”మనకి నచ్చిన వాళ్ళు పక్కనుంటే పల్లెవెలుగు బస్సులో కూడా చాలా హ్యాపీగా వెళతాం, అదే నచ్చని మనిషి పక్కనుంటే బెంజ్ కార్లో కూడా ఇబ్బందిగానే ఉంటుంది. మనిషికి కావాల్సింది హ్యాపీనెస్ కానీ లగ్జరీ కాదు.” ఎలాంటి సంతోషం ఉండదు’ అనే డైలాగ్స్ తో పాటు కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ బాగుంది. దర్శకుడిగా త్రినాథరావు మరోసారి తన టాలెంట్ చూపించాడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా మరోసారి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ స్టాండర్డ్స్ ను చాటింది.

జీ సినిమాలు సమీక్ష :

చచ్చే ముందు ఎవ్వడికైనా ఒక్కసారి ఫ్లాష్  అవుతుందంటారు. కానీ నాకు గడిచిన 2 నెలలు మాత్రమే ఫ్లాష్ అవుతుంది అంటూ ఎమోషనల్ సీన్ తో… వినోదాత్మకంగా సినిమాను స్టార్ట్ చేసిన దర్శకుడు ఇంటర్వెల్ వరకూ ఆ ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా జాగ్రత్త పడ్డాడు. ఇక ఇప్పటి వరకూ నానిని ఎవరూ చూపించని విధంగా మాస్ క్యారెక్టర్ లో చూపించి… క్లయిమాక్స్ వరకు  ఎంటర్టైన్ చేశాడు దర్శకుడు. ప్రసన్న కుమార్ అందించిన కథ కాస్త రొటీన్ అనిపించినప్పటికీ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సినిమాకు ప్లస్ గా నిలిచాయి. నాని మాస్ పర్ఫార్మెన్స్, కీర్తి గ్లామరస్ యాక్టింగ్, దేవిశ్రీ కంపోజ్ చేసిన సాంగ్స్, డైలాగ్స్, కామెడీ సీన్స్, నాని-కీర్తి మధ్య  రొమాంటిక్ సీన్స్, ఫైట్స్, ఇంటర్వెల్ కి ముందు వచ్చే నవీన్ చంద్ర క్యారెక్టర్ ట్విస్ట్, ప్రీ క్లైమాక్స్ సీన్, క్లైమాక్స్ సీన్స్ సినిమాకు హైలైట్స్. ఓవరాల్ గా నేనులోకల్ సినిమా యూత్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని బాగా అలరిస్తుంది. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న నాని.. నేను లోకల్ సినిమాతో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

రేటింగ్ : 3.5/5