లక్కున్నోడు రివ్యూ

Thursday,January 26,2017 - 03:00 by Z_CLU

విడుదల : జనవరి 26,2017

నటీ నటులు : మంచు విష్ణు, హన్సిక మోత్వాని

సినిమాటోగ్రఫీ : పి.జి.విందా

మ్యూజిక్ : అచ్చు

స్క్రీన్ ప్లే, మాటలు: డైమండ్ రత్నబాబు

నిర్మాత : ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌

కథ-దర్శకత్వం : రాజ్ కిరణ్

మంచు విష్ణు, హన్సిక మోత్వాని జంటగా రాజ్ కిరణ్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘లక్కున్నోడు’ ఈ వారం థియేటర్స్ లోకిచ్చింది. ‘గీతాంజ‌లి’, ‘త్రిపుర’ వంటి హ‌ర్ర‌ర్ సినిమాల ద‌ర్శ‌కుడు రాజ్ కిర‌ణ్ తెరకెక్కించిన ఈ సినిమా విష్ణు కి ఎలాంటి లక్ తీసుకొచ్చిందో? చూద్దాం.

కథ :

చిన్నతనం నుంచి లక్ వెంట తెచ్చి అంతలోనే అన్ లక్ ను దూరం చేసే లక్కీ(విష్ణు) ని అన్ లక్కీ గా భావించి దూరం పెడతాడు లక్కీ తండ్రి భక్త వత్సల. ఇక ఉద్యోగ అవకాశం కోసం హైదరాబాద్ వచ్చిన లక్కీ కి పాజిటీవ్ గా ఆలోచించే పద్మ(హన్సిక ) పరిచయం అవుతుంది. తొలి చూపులోనే పద్మ ను చూసి ప్రేమలో పడిన లక్కీ పద్మ ను ఎలా దక్కించుకున్నాడు? ఈ క్రమంలో తన అన్ లక్ కి కారణమైన జె.కె(ఎం.వి.వి.సత్యనారాయణ)ను ఎలా ఎదుర్కున్నాడు? చివరిగా 25 ఏళ్ళు దూరమైన తన తండ్రికి  మళ్ళీ ఎలా దగ్గరయ్యాడు? అనేది సినిమా కథాంశం..

నటీ నటుల పని తీరు :

లక్కీ అనే ఎనర్జిటిక్ కుర్రాడిగా తన నటనతో ఆకట్టుకొని సినిమాకు హైలైట్ గా నిలిచాడు విష్ణు. పద్మ క్యారెక్టర్ లో హన్సిక సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో తన గ్లామరస్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది.  వెన్నెల కిషోర్, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్ కామెడీ క్యారెక్టర్స్ తో ఎంటర్టైన్ చేశారు. ఎం.వి.వి. సత్యనారాయణ విలన్ లుక్ తో పరవాలేదనిపించాడు కానీ సరైన విలనిజం చూపించడంలో కాస్త విఫలం అయ్యాడు.  తనికెళ్ళ భరణి,రఘు బాబు, పోసాని,సురేష్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నీషియన్స్ పని తీరు :

రత్న బాబు రాసిన డైలాగ్స్ లో కొన్ని కామెడీ డైలాగ్స్ అలరించాయి. పి.జి.వింద సినిమాటోగ్రఫీ బాగుంది. అచ్చు అందించిన పాటలు పరవాలేదనిపించగా ‘ఓ సిరి మల్లి’ అనే పాట బాగా  ఆకట్టుకుంది.. చిన్నా అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ ప్రొడక్షన్ వాల్యూస్ పరవాలేదు.

జీ సినిమాలు సమీక్ష :

కాస్త పాత కథని ప్రెజెంట్ నోట్ల రద్దు ఇష్యూ తో స్టార్ట్ చేసి స్టార్టింగ్ లో సినిమాపై ఇంటరెస్ట్ తీసుకొచ్చిన దర్శకుడు సరైన స్క్రీన్ ప్లే తో పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ చేయలేకపోయాడు. ఇక రత్నబాబు డైలాగ్స్ బాగున్నా కథకు సరైన స్క్రీన్ ప్లే అందించడం లో విఫలం అయ్యాడు. విష్ణు ఎనర్జిటిక్ క్యారెక్టర్, హన్సిక గ్లామర్, డైలాగ్స్, కొన్ని కామెడీ సీన్స్, సెంటిమెంట్ సీన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకు ప్లస్ అవ్వగా కథ, స్క్రీన్ ప్లే మైనస్ గా నిలిచాయి. మొదటి సాంగ్ లో మోహన్ బాబు ఎంట్రీ ఇచ్చి విష్ణు తో డాన్స్ వేయడం మంచు ఫాన్స్ తో పాటు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది.ఫైనల్ గా కథ కథనం పక్కన పెడితే ‘లక్కున్నోడు’ కొన్ని ఎంటర్టైన్మెంట్స్ సీన్స్ తో పరవాలేదనిపిస్తాడు.

రేటింగ్ : 2.5/5