'ఇంద్రసేన' రివ్యూ

Thursday,November 30,2017 - 06:38 by Z_CLU

నటీ నటులు : విజయ్‌ ఆంటోని, డయానా చంపిక, మహిమ, జ్యువెల్‌ మేరీ, రాధా రవి, కాళి వెంకట్‌, నళిని కాంత్‌, రింధు రవి తదితరులు

మ్యూజిక్‌ : విజయ్‌ ఆంటోని

సినిమాటోగ్రఫీ : కె.దిల్‌రాజు

మాటలు- పాటలు : భాషా శ్రీ,

ఆర్ట్‌: ఆనంద్‌ మణి,

నిర్మాతలు : రాధికా శరత్‌కుమార్‌, ఫాతిమా విజయ్‌ ఆంటోని, నీలం కృష్ణారెడ్డి

కథ -స్క్రీన్ ప్లే- దర్శకత్వం : జి.శ్రీనివాసన్‌.

రిలీజ్ డేట్ : 10 నవంబర్ 2017

 

డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వస్తున్న విజయ్‌ ఆంటోని నటించిన లేటెస్ట్ సినిమా ‘ఇంద్రసేన’. జి.శ్రీనివాసన్‌ దర్శకత్వం లో  యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి విజయ్ అంటోనీ డ్యూయెల్ రోల్స్ లో నటించిన ఈ సినిమా ఎలా ఎంటర్టైన్ చేసిందో.. తెలుసుకుందాం.


కథ :

ఇంద్రసేన(విజయ్ ఆంటోనీ), రుద్రసేన(విజయ్ ఆంటోనీ) ఇద్దరూ ఒకేలా ఉండే అన్నదమ్ములు. పెద్దవాడైన ఇంద్రసేన తన ప్రియురాలు చనిపోవడంతో తననే  తలుచుకుంటూ తాగుడుకు బానిస అవుతాడు. చిన్నవాడైన రుద్రసేన ఓ స్కూల్ లో పీ.టి మాస్టర్ గా పనిచేస్తూ పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతాడు. ఈ క్రమంలో అనుకోకుండా ఓ హత్య కేసులో జైలుకి వెళ్తాడు ఇంద్రసేన. దాదాపు 7 ఏళ్ళు జైలు శిక్ష తర్వాత తిరిగి వచ్చిన ఇంద్రసేన ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంటాడు.  తన ఉద్యోగంతో ఆనందంగా జీవితాన్ని గడిపే రుద్రసేన ఎలా మారతాడు. చివరికీ అన్నదమ్ములైన ఇంద్రసేన- రుద్రసేన జీవితంలో ఎలాంటి మార్పు చోటు చేసుకుంది…అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు :

రెండు విభిన్న పాత్రల్లో విజయ్ ఆంటోనీ తన నటనతో మెప్పించాడు. ముఖ్యంగా కొన్ని యాక్షన్ సీన్స్ లో, ఎమోషనల్ సీన్స్ లో మరో సారి తన పెర్ఫార్మెన్స్ తో సినిమాకు హైలైట్ గా నిలిచాడు. డయానా చంపిక, మహిమ తమ క్యారెక్టర్స్ తో ఎంటర్టైన్ చేసి సినిమాకు ప్లస్ అయ్యారు. ఇక జ్వెల్ మారీ, రాదా రవి, కాళీ వెంకట్, నళినీ కాంత్, రింధు రవి, చెరన్ రాజ్ తదితరులు తమ క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించుకున్నారు.

టెక్నీషియన్స్ పనితీరు :

సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ గురించే. తన కెమెరాతో సినిమాకు ప్లస్ అయ్యాడు సినిమాటోగ్రాఫర్ కె.దిల్‌రాజు. విజయ్ ఆంటోనీ కంపోజ్ చేసిన రెండు సాంగ్స్ బాగున్నాయి. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఎడిటింగ్ పరవాలేదు కానీ సెకండ్ హాఫ్ ఇంకాస్త ట్రిమ్ చేయొచ్చనిపించింది. భాషశ్రీ అందించిన మాటలు-సాహిత్యం బాగున్నాయి. స్టోరీ -స్క్రీన్ ప్లే రొటీన్ అనిపించాయి. ప్రొడక్షన్ వాల్యూస్ పరవాలేదు.


జీ సినిమాలు సమీక్ష :

విజయ్ ఆంటోనీ నుంచి ఓ సినిమా వస్తుందంటే ఆ సినిమాపై ప్రేక్షకుల్లో ఓ మోస్తరు అంచనాలుంటాయి. ఇప్పటి వరకూ విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన సినిమాలన్నీ డిఫరెంట్ స్టోరీస్ తో తెరకెక్కడమే దీనికి రీజన్. అయితే బిచ్చగాడు తర్వాత విజయ్ ఆంటోనీ కి తెలుగులో మంచి క్రేజ్ లభించింది. అయితే ఆ క్రేజ్ తోనే తను తమిళ్ లో నటించిన ప్రతీ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా తీసుకొస్తూ ఇక్కడ కూడా సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు విజయ్ ఆంటోనీ. అయితే లేటెస్ట్ గా విజయ్ ఆంటోనీ నటించిన ‘భేతాళుడు’ సినిమా కూడా ఓ విభిన్న కథా చిత్రంగా తెరకెక్కడంతో ఇంద్రసేన కూడా ఓ డిఫరెంట్ స్టోరీ లైన్ తో ఉంటుందనుకున్నారంతా.

ఇక సినిమా విషయానికొస్తే విడుదలకి ముందే మొదటి పదినిమిషాల సినిమా చూపించి అందరినీ ఎట్రాక్ట్ చేసిన విజయ్ ఆంటోనీ సినిమాతో పూర్తి స్థాయిలో  మెస్మరైజ్ చేయలేకపోయాడు. అన్నదమ్ముల అనుబంధం నేపధ్యంలో ఓ రొటీన్ స్టోరీ ని సెలెక్ట్ చేసుకున్న దర్శకుడు శ్రీనివాసన్ ఫస్ట్ హాఫ్ లో తన స్క్రీన్ ప్లే తో పరవాలేదనిపించుకున్నప్పటికీ సెకండ్ హాఫ్ లో మాత్రం తడబడ్డాడు. సినిమా స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ ఎపిసోడ్ వరకూ ప్రేక్షకుడిలో  ఇంటరెస్ట్ కలిగించి ఎంటర్టైన్ చేసిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో కన్ఫ్యూజన్ స్క్రీన్ ప్లే తో  బోర్ కొట్టించాడు.

 

విజయ్ ఆంటోనీ పెర్ఫార్మెన్స్, డయానా- మహిమ క్యారెక్టర్స్, EMI లా వచ్చి సాంగ్ పిక్చరైజేషన్, ఇంటర్వెల్ ట్విస్ట్, యాక్షన్ సీన్స్, ప్రీ క్లైమాక్స్ సినిమాకు హైలైట్ గా నిలవగా వీక్ అనిపించే క్లైమాక్స్, స్లో నేరేషన్, రొటీన్ అనిపించే కథ-కథనం సినిమాకు మైనస్. ఫైనల్ గా ‘ఇంద్రసేన’ ఓ మోస్తరుగా ఎంటర్టైన్ చేస్తాడు.

 

రేటింగ్ : 2.5 /5