'ఆక్సిజన్' రివ్యూ

Thursday,November 30,2017 - 05:27 by Z_CLU

నటీ నటులు : గోపీచంద్ సరసన రాశీఖన్నా, అను ఇమ్మానుయేల్,జగపతిబాబు, అభిమన్యు సింగ్, కిక్ శ్యామ్, బ్రహ్మాజీ, ఆలి తదితరులు

సినిమాటోగ్రఫీ : వెట్రి-ఛోటా కె.నాయుడు

ఎడిటింగ్: ఎస్.బి.ఉద్ధవ్

మ్యూజిక్ : యువన్ శంకర్ రాజా

నిర్మాత : ఎస్.ఐశ్వర్య

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : ఏ.ఎం.జ్యోతికృష్ణ

రిలీజ్ డేట్ : 10 నవంబర్ 2017

 

గతకొంత కాలంగా వాయిదా పడుతూ వస్తున్న గోపీచంద్ ‘ఆక్సిజన్’ ఎట్టకేలకి థియేటర్స్ లోకి అడుగుపెట్టింది. మరి ట్రైలర్ తో ఎట్రాక్ట్ చేసి అంచనాలు పెంచిన ఈ సినిమాతో గోపీచంద్ ఎలా ఎంటర్టైన్ చేశాడో..చూద్దాం.

కథ :

ఊరిలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న రఘుపతి(జగపతిబాబు) అన్నయ్య శ్రీపతి(నాగినీడు) తన సొంత ఫ్యాక్టరీలో దారుణ హత్యకు గురవుతాడు.. కుటుంబంలో అందరిని హత్య చేసేందుకు ఒక వైపు ప్రత్యర్థి వీరభద్రం(షియాజి షిండే), మరో వైపు గుర్తు తెలియని కిల్లర్ గ్యాంగ్ ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ క్రమంలో రఘుపతి కూతురు శ్రుతి(రాశి ఖన్నా)ని పెళ్లి చూపులు చూసుకోవడం కోసం అమెరికా నుంచి వస్తాడు కృష్ణ ప్రసాద్(గోపిచంద్)… అసలు కృష్ణ ప్రసాద్ ఎవరు..? కథకి ఆక్సిజన్ పేరుకి సంబంధం ఏమిటి..? అనేది మిగతా కథ.

నటీనటులు పనితీరు :

గోపీచంద్ కి ఇది కొత్త పాత్రలా అనిపించదు కానీ మిలటరీ ఆఫీసర్ గా బాగానే మెప్పించాడు. ఫస్ట్ హాఫ్ లో డీసెంట్ లుక్ తో అలరించిన గోపీచంద్ సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఎమోషనల్ సీన్స్ లో మెస్మరైజ్ చేశాడు. రాశి ఖన్నా తన క్యారెక్టర్ తో పరవాలేదనిపించుకుంది. అను ఇమ్మానుయేల్ తన గ్లామర్ తో ఆకట్టుకుంది. జగపతి బాబు ఎప్పటి లాగే తన క్యారెక్టర్ తో  సినిమాకు ప్లస్ అయ్యాడు. ఆలి కామెడీ అక్కడక్కడా ఎంటర్టైన్ చేసింది. వెన్నెల కిశోర్, తాగుబోతు రమేష్ ఎంటర్టైన్ చేయలేకపోయారు. సాక్షి చౌదరి ఐటెం సాంగ్ తో ఆకట్టుకుంది. ఇక షియాజీ షిండే, కిక్ శ్యామ్, బ్రహ్మాజీ, అభిమన్యు సింగ్, సితార, కాలకేయ ప్రభాకర్, సుధ, చంద్రమోహన్, తదితరులు తమ క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించుకున్నారు.

టెక్నీషియన్స్ పని తీరు :

ఫోటోగ్రఫీ బాగుంది. యువన్ శంకర్ రాజా అందించిన పాటలు గుర్తుండేలా లేవు కానీ పరవాలేదనిపిస్తాయి. చిన్నా అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఫైట్స్ సినిమాకు హైలైట్ గా నిలిచి ఎట్రాక్ట్ చేశాయి. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ ఫైట్ ప్రీ క్లైమాక్స్ ఫైట్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. విజువల్ ఎఫెక్ట్స్ వల్లే ఆలస్యం జరిగిందని యూనిట్ చెప్పినప్పటికీ కొన్ని సీన్స్ లో తప్ప మరెక్కడా గ్రాఫిక్స్ వర్క్ కనిపించలేదు. ఎడిటింగ్ పరవాలేదు. ఆర్ట్ వర్క్ బాగుంది. జ్యోతి కృష్ణ స్టోరీ -స్క్రీన్ ప్లే ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎంటర్టైన్ చేయలేకపోయాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

అప్పుడెప్పుడో ‘ నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయం అయిన జ్యోతి కృష్ణ చాలా గ్యాప్ తర్వాత గోపి చంద్ హీరోగా భారీ  బడ్జెట్ తో ‘ఆక్సిజన్’ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడగానే ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలు నెలకొన్నాయి. అయితే ఎప్పటికప్పుడు రిలీజ్ డేట్ వాయిదా పడుతూ రావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కూడా తగ్గిపోయాయని చెప్పాలి. నిజానికి రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సినిమా అన్ని అవాంతరాలను దాటి ఎట్టకేలకి థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చింది.

ఇక సినిమా విషయానికొస్తే దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకుడిగా మేకింగ్ పరంగా పరవాలేదనిపించుకున్నాడు కానీ స్టోరీ-స్క్రీన్ ప్లే విషయం లో ఇంకాస్త జాగ్రత్త పడితే బాగుండేదనిపించింది. నిజానికి యూత్ కి ఓ స్ట్రాంగ్ మెసేజ్ అందిస్తూ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించిన జ్యోతి కృష్ణ ఆ సందేశాన్ని అందరికీ టచ్ చేసేలా చూపించలేకపోయారు. అందుకే కొన్ని సందర్భాలలో వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా తేలిపోయాయి. బోర్డర్ లో దేశం కోసం పోరాడే ఓ ఆర్మీ ఆఫీసర్ ప్రస్తుతం  సమాజంలో జరుగుతున్న ఓ సమస్యపై పోరాడితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ బాగున్నప్పటికీ, దాన్ని తన స్క్రీన్ ప్లే తో ఎంటర్టైన్ చేయలేక రొటీన్ రూట్ లోకి తీసుకెళ్లి మెస్మరైజ్ చేయలేకపోయాడు జ్యోతి కృష్ణ. నిర్మాణ రంగంలో తనకున్న అనుభవంతో ప్రతీ ఫ్రేమ్ కాస్ట్లీ గా చూపించి మేకింగ్ పరంగా పరవాలేదనిపించుకున్నాడు. హీరోగా ఇప్పటికే ఎన్నో యాక్షన్ ఎంటర్టైనర్స్ చేసిన గోపీచంద్ మరోసారి అదే జోనర్ సెలెక్ట్ చేసుకొని రొటీన్ అనిపించాడు.

గోపీచంద్ క్యారెక్టర్, సాంగ్స్, ఫైట్స్, ఇంటర్వెల్ ట్విస్ట్, ఆలి కామెడీ, అను ఇమ్మానుయేల్ గ్లామర్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ సినిమాకు హైలైట్ గా నిలవగా రొటీన్ స్క్రీన్ ప్లే, ఫస్ట్ హాఫ్ లో బోర్ కొట్టించే సీన్స్, ఆల్రెడీ మిగతా సినిమాల్లో చూసేసిన సీన్స్ మళ్ళీ చూపించడం సినిమాకు పెద్ద మైనస్. ఫైనల్ గా ఓ మెసేజ్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆక్సిజన్ జస్ట్ పరవాలేదనిపిస్తుంది.

 

రేటింగ్ : 2.5 /5