'గుంటూరోడు' రివ్యూ

Friday,March 03,2017 - 02:24 by Z_CLU

విడుదల : మార్చ్ 3 ,2017

నటీ నటులు : మంచు మనోజ్, ప్రగ్యా జైస్వాల్

సినిమాటోగ్రఫీ : సిద్దార్ధరామస్వామి

మ్యూజిక్ : DJ శ్రీ వసంత్

నిర్మాత : శ్రీ వరుణ్ అట్లూరి

కథ- మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : S.K. సత్య

ఎనర్జిటిక్ స్టార్ మంచు మనోజ్ లేటెస్ట్ సినిమా ‘గుంటూరోడు’ ఈ రోజే ప్రేక్షకులముందుకొచ్చింది.. మరి ‘గుంటూరోడు’ గా మనోజ్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ఎలా ఎంటర్టైన్ చేసాడో.. చూద్దాం

కథ :

భార్య చనిపోవడంతో తనయుడు కన్నా(మంచు మనోజ్) ను అమితంగా ప్రేమిస్తూ గారాబంగా పెంచుకుంటాడు సూర్యనారాయణ (రాజేంద్ర ప్రసాద్). అలా తండ్రి గారాబం తో దేనినైనా లెక్కచేయకుండా గుంటూరులో జరిగే ప్రతీ అన్యాయంలో తలదూరుస్తూ గొడవలు పడుతూ అల్లరిచిల్లరిగా తిరిగే కన్నా అమృత(ప్రగ్య జైస్వాల్) అనే అమ్మయిని మొదటి చూపులోనే చూసి ప్రేమలో పడతాడు.. ఈ క్రమంలో గుంటూరులో క్రిమినల్ లాయర్ ఇగోయిస్టు శేషు(సంపత్) తో అనుకోకుండా ఓ సందర్భం లో గొడవ పడతాడు.. అలా శేషు ఎవరో తెలియకుండానే అతనికి శత్రువుగా మారిన కన్నా చివరికి శేషును ఎలా ఎదుర్కున్నాడు… ఫైనల్ గా శేషు చెల్లెలైన అమృతను ఎలా దక్కించుకున్నాడు..అనేది సినిమా కథాంశం….

 

నటీనటుల పనితీరు :

గుంటూరోడుగా మనోజ్ తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఎనర్జిటిక్ యాక్షన్ తో ఎంటర్టైన్ చేశాడు. కానీ మరీ లావు గా కనిపించాడు.. ఇక ప్రగ్య తన గ్లామర్ తో అమృత క్యారెక్టర్ తో పరవలేదనిపించుకుంది. విలన్ గా సంపత్ మరో సారి తన డిఫరెంట్ ఇగోయిస్ట్ క్యారెక్టర్ తో ఆకట్టుకున్నాడు… కోట శ్రీనివాస్ సీనియర్ పొలిటిషన్ గా తన క్యారెక్టర్ కి పూర్తి న్యాయం చేశారు. సత్య, ప్రవీణ్ తమ కామెడీతో పరవాలేదనిపించుకున్నారు.. పృథ్వి క్యారెక్టర్ రొటీన్ గా ఉన్నా కామెడీ అలరించింది.. రావు రమేష్, జెమినీ సురేష్, హర్ష తదితరులు తమ క్యారెక్టర్ కి న్యాయం చేశారు…

 

టెక్నీషియన్స్ పని తీరు :

ఈ సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ లో ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ డి.జె.వసంత్ గురించే చెప్పాలి. సిద్దార్థ్ రామస్వామి సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.. మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది. ముఖ్యంగా ‘కదిలే రంగుల విల్లురా’ సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సాంగ్ కి రామజోగయ్య సాహిత్యం మరింత అందం తీసుకొచ్చింది. చిన్నా అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఇతర సినిమాలో వినిపించినట్టుగా ఉంది. పైగా ప్రతీ యాక్షన్ సన్నివేశానికి అదే ఆర్.ఆర్ పదే పదే వాడటం కాస్త నవ్వు తెప్పిస్తుంది కూడా… ఎడిటింగ్ పరవాలేదు…

 

జీ సినిమాలు సమీక్ష :

మంచు మనోజ్ ‘గుంటూరోడు’ అనే పవర్ ఫుల్ టైటిల్ తో వస్తున్నాడనగానే ఇదేదో గుంటూరు లో జరిగే సరి కొత్త యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా అనుకున్నారంతా.. పైగా టీజర్ కూడా అందరినీ ఆకట్టుకోవడంతో సినిమా పై ఓ మోస్తరు అంచనాలు నెలకొన్నాయి. అలా కాస్త అంచనాలతో థియేటర్స్ కి వెళ్లిన ప్రేక్షకులతో పాటు ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళ్లిన ప్రేక్షకులను కూడా తన స్క్రీన్ ప్లే తో పూర్తి స్థాయి లో ఎంటర్టైన్ చేయలేకపోయాడు దర్శకుడు సత్య.. రొటీన్ యాక్షన్ కథే అయినప్పటికీ సరైన స్క్రీన్ ప్లే అందించడంలో కాస్త విఫలం అయ్యాడు.. సినిమా స్టార్టింగ్ లో కొడుకుని అమితంగా ప్రేమించే సూర్య నారాయణ తో కూడిన సీన్స్, తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ పండలేదు.. కొన్ని యాక్షన్ సీన్స్ లో మంచు మనోజ్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో మాస్ ఆడియన్స్ ఎంటర్టైన్ చేశాడు.. సినిమా ఆరంభంలో చిరు వాయిస్ ఓవర్ సినిమాకు ప్లస్ అయింది.. మనోజ్ ప్రగ్య మధ్య వచ్చే లవ్ సీన్స్ కూడా కనెక్ట్ అవ్వలేదు.. మనోజ్ పెర్ఫార్మెన్స్, ప్రగ్య గ్లామర్, ఫైట్స్, సంపత్ క్యారెక్టర్, ఫస్ట్ హాఫ్ లో రాజేంద్ర ప్రసాద్ సీన్స్, పృథ్వి కామెడీ, సినిమాకు ప్లస్ గా నిలవగా రొటీన్ కథ, స్క్రీన్ ప్లే సినిమాకు పెద్ద మైనస్ గా నిలిచాయి. ఓవరాల్ గా యాక్షన్ ఇష్టపడే మాస్ ఆడియన్స్ కు ‘గుంటూరోడు’ నచ్చుతాడు..

 

రేటింగ్ : 2 .5 /5