గాయత్రి రివ్యూ

Friday,February 09,2018 - 07:18 by Z_CLU

నటీ నటులు : డా.మోహన్ బాబు, విష్ణు, శ్రియ, నిఖిలా విమల్,అనసూయ, బ్రహ్మానందం, శివ ప్రసాద్ తదితరులు

సంగీతం: ఎస్.ఎస్.థమన్

ఛాయాగ్రహం : సర్వేశ్ మురారి

మాటలు : రత్నం బాబు

నిర్మాత : డా. మోహన్ బాబు యమ్.

దర్శకత్వం : మదన్ రామిగాని

రిలీజ్ డేట్ : 9 ఫిబ్రవరి 2018

డా. మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన ‘గాయత్రి’ఈరోజే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మదన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం..


కథ :

రంగస్థల నటుడైన శివాజీ( వయసులో ఉన్నప్పుడు విష్ణు వయసు మళ్ళిన తర్వాత మోహన్ బాబు) అప్పుడప్పుడూ డబ్బుకోసం నేరస్తుడిలా నటిస్తూ చేయని తప్పులకు శిక్ష అనుభవిస్తుంటాడు. అయితే ఒకానొక సందర్భంలో తన భార్య శారద(శ్రియ)ను పొగుట్టుకొని తన కూతురు గాయత్రి(నిఖిలా రామన్) కి కూడా దూరం అవుతాడు. తన భార్య పేరుతో శారదా సదనం అనే ఆనాద శరణాలయం నడుపుతూ ఎప్పటికైనా తన కూతురిని కలుసుకోవాలని ఎదురుచూస్తుంటాడు. అయితే తనకి పరిచయం ఉన్న గాయత్రీయే తన కూతురు అని తెలుసుకుంటాడు శివాజి. ఈ క్రమంలో గాయత్రి ని చంపాలని చూస్తుంటాడు గాయత్రీ పటేల్(మోహన్ బాబు) . ఇంతకీ గాయత్రి పటేల్ ఎవరు.. అతనికి శివాజీ కూతురు గాయత్రీ కి సంబంధం ఏమిటి.. మధ్యలో శ్రేష్ట(అనసూయ) ఎవరు.. చివరికి గాయత్రీ పటేల్ నుంచి తన కుమార్తె గాయత్రీని శివాజీ ఎలా కాపాడాడు.. తండ్రిగా ఆమెకు ఎలా దగ్గరయ్యాడు..అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు :

ఇప్పటికే కొన్ని సినిమాల్లో డ్యూయల్ రోల్స్ చేసి ఎంటర్టైన్ చేసిన మోహన్ బాబు మరోసారి తన పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసాడు. ముఖ్యంగా తన డైలాగ్ డెలివరీ, పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో గాయత్రి పటేల్ రోల్ కి బెస్ట్ అనిపించుకున్నాడు. వయసులో ఉన్నప్పుడు శివాజీ గా మంచు విష్ణు పరవాలేదనిపించాడు. శ్రియ తన పెర్ఫార్మెన్స్ తో ఎప్పటిలాగే క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అనిపించుకుంది. జర్నలిస్ట్ గా అనసూయ తన రోల్ కి న్యాయం చేసింది. గాయత్రి గా నిఖిలా విమల్ ఆకట్టుకుంది. బ్రహ్మానందం కామెడీ పండలేదు. అలీ- సత్యం రాజేష్-గీత భగత్ తమ కామెడి తో కొంత వరకూ ఎంటర్ టైన్ చేశారు. శివ ప్రసాద్ , తనికెళ్ళ భరణి , రాజా రవీంద్ర, నాగినీడు తమ క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించుకున్నారు. ఇక గిరిబాబు,కోట శ్రీనివాస రావు, రఘు బాబు, జీవ.పృథ్వి,కాశీ విశ్వనాధ్, చమ్మక్ చంద్ర,అవినాష్ తదితరులు తమ క్యారెక్టర్స్ తో పరవాలేదనిపించుకున్నారు.

టెక్నిషియన్స్ పనితీరు :

సినిమాకు పనిచేసిన టెక్నిషియన్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది థమన్ గురించే… తన మార్క్ సాంగ్స్ తో పాటు బాగ్రౌండ్ స్కోర్ తో సినిమాకు హైలైట్ గా నిలిచాడు థమన్. ముఖ్యంగా ఒక ‘నువ్వు ఒక నేను’,’సరసమహ’ ‘హనుమా’ సాంగ్స్ బాగున్నాయి. ‘ఒక నువ్వు ఒక నేను’ పాటకు రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం బాగుంది. సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫీ బాగుంది. పాటల చిత్రీకరణలో తన కెమెరా పనితనం చూపించాడు సర్వేశ్. ఎడిటింగ్ పరవాలేదు. కణల్ కన్నన్ ఫైట్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. రత్న బాబు డైలాగ్స్ సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాయి. సెకండ్ హాఫ్ లో మదన్ స్క్రీన్ ప్లే బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.


జీ సినిమాలు సమీక్ష :

మోహన్ బాబు డ్యూయల్ రోల్ చేస్తున్నాడనగానే ‘గాయత్రి’పై అంచనాలు అమాంతం పెరిగాయి.  మరీ ముఖ్యంగా యంగ్ మోహన్ బాబు పాత్రలో విష్ణు కనిపించబోతున్నాడని, ఇదొక అమ్మాయి చుట్టూ తిరిగే కథని తెలిసిన తర్వాత అంచనాలు ఇంకాస్త పెరిగాయి.

గతంలో తన కథలతో -డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో మెస్మరైజ్ చేసిన దర్శకుడు మదన్.. ఈ సినిమా కోసం ఓ రొటీన్ స్టోరీనే సెలెక్ట్ చేసుకున్నాడు. కాకపోతే ఆ కథను ఆసక్తికరంగా చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. ఇప్పటికే చూసిన కథే అయినప్పటికీ సెకండ్ హాఫ్ లో సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తూ మేజిక్ చేశాడు. మొదటి భాగంలో ఓల్డ్ ఫార్మాట్ అనిపించే సన్నివేశాలతో కాస్త బోర్ కొట్టించిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో మోహన్ బాబుని గాయత్రీ పటేల్ అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేసి రక్తికట్టించాడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలతో థ్రిల్ చేశాడు. ముఖ్యంగా గాయత్రి పటేల్ గా క్యారెక్టర్ ని హైలైట్ చేస్తూ వచ్చే సన్నివేశాలు  టోటల్ సినిమాకే హైలెట్. కాని సగటు ప్రేక్షకుడు కూడా కనిపెట్టి మాట్లాడుకునేలా కొన్ని లాజిక్స్  మిస్ అయ్యాడు దర్శకుడు.

గాయత్రి పటేల్ క్యారెక్టర్ , మోహన్ బాబు పెర్ఫార్మెన్స్, కలెక్షన్ కింగ్ చెప్పే డైలాగులు, విష్ణు- శ్రియ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, అనసూయ రోల్, ఒక నువ్వు ఒక నేను సాంగ్ , ఐటెం సాంగ్, బాగ్రౌండ్ మ్యూజిక్, పొలిటికల్ సెటైరికల్ డైలాగ్స్, ఫైట్స్ , ఎమోషనల్ సీన్స్,  ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ సీన్స్ సినిమాలో  హైలైట్స్..  రొటీన్ అనిపించే  స్టోరీ ,కొన్ని పాత సినిమాలను గుర్తు చేస్తూ వచ్చే సీన్స్, ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే, కామెడి పెద్దగా పండకపోవడం మైనస్.

ఓవరాల్ గా ఎమోషనల్ డ్రామాగా ‘గాయత్రి’ ఓ మోస్తరుగా ఎంటర్టైన్ చేస్తుంది.

రేటింగ్ : 2.5 / 5