'చిత్రాంగద' మూవీ రివ్యూ

Friday,March 10,2017 - 03:39 by Z_CLU

రిలీజ్ డేట్ : మార్చ్ 10 , 2017

నటీ నటులు : అంజలి, జెపీ, సప్తగిరి, రాజారవీంద్ర, సిందుతులానీ,రక్ష, దీపక్, సాక్షిగులాటి, జబర్ధస్త్ సుధీర్, జ్యోతి తదితరులు

సంగీతం: సెల్వగణేష్, స్వామినాథన్

ఎడిటర్: ప్రవీణ్‌పూడి

సమర్పణ: టీసీఎస్ రెడ్డి, వెంకట్ వాడపల్లి

నిర్మాతలు: గంగపట్నం శ్రీధర్, రెహమాన్.

కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: అశోక్.జి

 

అంజలి టైటిల్ పాత్రలో తెలుగు,తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం చిత్రాంగద. ‘పిల్ల జమీందార్’ ఫేం అశోక్ దర్శకత్వంలో హరీజెంటల్ థ్రిల్లర్ కామెడీ జోనర్ లో రూపొందిన ఈ సినిమా ఈరోజే థియేటర్ లోకొచ్చింది. మరి ‘చిత్రాంగద’ గా అంజలి ఈ సినిమాతో ఎలా ఎంటర్టైన్ చేసిందో  చూద్దాం….

 

కథ :

ఓ కాలేజ్ లో  ప్రొఫెసర్ గా పనిచేస్తూ హాస్టల్ లో ఉండే చిత్ర(అంజలి) మరో వైపు దెయ్యాల పై పరిశోధన చేస్తూ తనకే తెలియకుండా హాస్టల్ లో ఉండే అమ్మాయిలను వేధిస్తూ ఉంటుంది.. ఒకానొక సందర్భంలో తనకి ఓ విచిత్రమైన వ్యాధి ఉందని తెలుసుకున్న చిత్ర ఆ తర్వాత అది వ్యాధి కాదని పూర్వ జన్మ పగ తీర్చుకోవడానికి రవి వర్మ(దీపక్) మళ్ళీ  తన రూపం లో జన్మించాడని తెలుసుకుంటుంది.. మరి చిత్రంగాధ గా జన్మించిన  రవి వర్మ తన పూర్వ జన్మ పగ తీర్చుకున్నాడా..ఇంతకీ రవి వర్మ ను గతంలో చంపిందెవరు… అనేది సినిమా కథాంశం…

నటీ నటుల పని తీరు :

ఇప్పటి వరకూ నటించని సరి కొత్త క్యారెక్టర్ లో చిత్ర గా అంజలి తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది… అంజలి తర్వాత చెప్పుకోవాలిస్తుంది దీపక్ క్యారెక్టర్ గురించే.. రవి వర్మ గా విలన్ క్యారెక్టర్ లో మరో సారి మంచి మార్కులు అందుకున్నాడు.. సప్తగిరి క్యారెక్టర్ కాస్త రొటీన్ అనిపించినా కొన్ని సందర్భాలలో తన మార్క్ డైలాగ్ కామెడీ తో ఎంటర్టైన్ చేసాడు.. ఇక సిందుతులానీ , అర్జున బజ్వా, జెపీ, రాజారవీంద్ర, రక్ష, దీపక్, సాక్షిగులాటి, జబర్ధస్త్ సుధీర్, జ్యోతి తమ క్యారెక్టర్స్ ను న్యాయం చేశారు..

 

టెక్నీషియన్స్ పని తీరు :

ఈ తరహా సినిమాలకు బ్యాగ్రౌండ్ స్కోర్  చాలా ముఖ్యమనే  చెప్పాలి. కొన్ని సన్నివేశాలను బ్యాగ్రౌండ్ స్కోర్ ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ పరవాలేదు. కానీ ఇంకాస్త ట్రిమ్ చేయొచ్చు.. డైలాగ్స్ పరవాలేదనిపించాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా అమెరికా లొకేషన్స్ ను బాగా చూపించాడు సినిమాటోగ్రాఫర్.. దర్శకుడి కథ పరవాలేదనిపించినా స్క్రీన్ ప్లే కాస్త  బోర్ కొట్టించింది.. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి..

 

సమీక్ష :

అంజలి మొదటి సారి గా ‘చిత్రాంగద’  ఓ లేడి ఓరియెంటెడ్ సినిమా చేస్తుందన గానే ఈ సినిమా పై ఓ మోస్తారు అంచనాలు ఏర్పడ్డాయి.. కానీ ఆ అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయిందనే చెప్పాలి.. ముఖ్యంగా ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడు ఓ వర్గం ఆడియన్స్ రెడీ గానే ఉంటారు.. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నా దాన్ని ప్రెజెంట్ చేసే విధానంలో కాస్త లోపం జరిగిందనే చెప్పాలి… మొదట ఓ వ్యాధి నుంచి ఆత్మలవైపుకి ఆ తర్వాత పూర్వ జన్మలంటూ కథని ఎన్నో మలుపులు తిప్పిన దర్శకుడు ఆ మలుపుల విషయం లో  ఇంకాస్త జాగ్రత్త వహిం బాగుండేది… అంజలి యాక్టింగ్, కొన్ని ఊహించని ట్విస్టులు, బ్యాగ్రౌండ్ స్కోర్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాకు ప్లస్ గా నిలవగా, సినిమా ప్రారంభం నుంచి ప్రేక్షకుడిలో సస్పెన్స్ క్రియేట్ చేసే సీన్స్ పెద్దగా లేకపోవడం, పైగా కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టించడం, కథను సాగదీసిన విధానం మైనస్ గా నిలిచాయి.. ఓవరాల్ గా థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ‘చిత్రాంగద’ నచ్చొచ్చు…

 

రేటింగ్ : 2 .5  /5