'నేనోరకం' రివ్యూ

Wednesday,March 15,2017 - 06:16 by Z_CLU

రిలీజ్ : 17మార్చ్ 2017

నటీనటులు : రామ్ శంకర్ , శరత్ కుమార్, రేష్మిమీనన్

ఇతర నటీనటులు : ఆదిత్య మీనన్, కాశీ విశ్వనాథ్, పృధ్వీ, వైవా హర్ష, జబర్దస్త్ టీమ్

సినిమాటోగ్రఫీ : సిద్ధార్థ రామస్వామి

కెమెరా: సిద్దార్ద్

ఎడిటింగ్ : కార్తీక్ శ్రీనివాస్

సంగీతం: మహిత్ నారాయణ్

నిర్మాత : దేపా శ్రీకాంత్

కథ-మాటలు- స్క్రీన్ ప్లే – దర్శకత్వం : సుదర్శన్ సలేంద్ర

 

రామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ప్రత్యేక పాత్రలో సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ‘నేనోరకం’ ఈ శుక్రవారం థియేటర్స్ లోకి రానుంది. ఈ సినిమాను ప్రత్యేకంగా చూసిన
జీ-సినిమాలు టీం, ప్రేక్షకుల కోసం ముందుగానే రివ్యూ అందిస్తోంది.

 

కథ :-

ఓ ప్రయివేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేసే గౌతమ్(రామ్ శంకర్) ఓ సందర్భంలో స్వేచ్ఛ(రేష్మి మీనన్) అనే అమ్మాయిని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు.. స్వేచ్ఛను ప్రేమలో పడేయడానికి ప్రయత్నాలు చేస్తున్న గౌతమ్ అనుకోని సందర్భంలో కొన్ని చిక్కుల్లో పడతాడు… అసలు గౌతమ్ జీవితంలో అనుకోకుండా వచ్చిన ఆ మార్పేంటి… చివరికి ఆ సమస్య నుంచి బయటపడ్డ గౌతమ్ స్వేచ్ఛను ఎలా దక్కించుకున్నాడు అనేది స్టోరీ.

 

నటీనటుల పనితీరు :

రామ్ శంకర్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ఎంటర్టైన్ చేశాడు. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ లో నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు. ఇక శరత్ కుమార్ డిఫరెంట్ క్యారెక్టర్ లో, తన నేచురల్ యాక్టింగ్ తో సినిమాకు హైలైట్ గా నిలిచాడు. రేష్మి మీనన్ ఆకట్టుకుంది.. పల్లవి నటన బాగుంది. ఎమ్మెస్ నారాయణ, వైవా హర్ష తమ కామెడీతో బాగానే నవ్వించారు. కాశీ విశ్వనాధ్, పృథ్వి, ఆదిత్య, దిల్ రమేష్, అప్పారావు ,గౌతమ్ రాజు, చమ్మక్ చంద్ర, శ్రీను, చంటి, సుధీర్ తదితరులు తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు..

టెక్నీషియన్స్ పనితీరు :

ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ మహిత్ నారాయణ గురించే. చక్రి తమ్ముడిగా పరిశ్రమకు పరిచయం అయినా మహిత్ ఈ సినిమాకు అందించిన పాటలు ప్లస్ అయ్యాయి. ‘పిడికెడు నడుము’, ‘చూడకుండా ఉండలేనే’, ‘నా చెలి ఏది’,’ చిరునవ్వే’ పాటల్లో సంగీతంతో పాటు సాహిత్యం కూడా బాగుంది. కొన్ని పాటల పిక్చరైజేషన్, మరికొన్ని సీన్స్ తో తన ప్రతిభ చూపించాడు సినిమాటోగ్రాఫర్ సిద్ధార్థ రామస్వామి. దర్శకుడు సుదర్శన్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ పరవాలేదు.

జీ సినిమాలు సమీక్ష :

ప్రస్తుతమున్న కాంటెంపరరీ ఇష్యూస్ ను స్పూర్తిగా తీసుకొని తనదైన స్క్రీన్ ప్లే తో ఎంటర్టైన్ చేశాడు దర్శకుడు సుదర్శన్ సలేంద్ర. గతంలో అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసిన అనుభవంతో క్యారెక్టర్స్ కి సూట్ అయ్యే ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకొని అక్కడే మొదటి సక్సెస్ అందుకున్నాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో ఎంటర్టైనింగ్ సీన్స్ తో అలరించి రెండో భాగంలో థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే, ట్విస్టులతో దర్శకుడిగా ప్రతిభ చాటుకున్నాడు.
రామ్ శంకర్ ఎనర్జిటిక్ యాక్టింగ్, శరత్ కుమార్ క్యారెక్టర్, ఎం.ఎస్, వైవా హర్ష కామెడీ, డైలాగ్స్, ఇంటర్వెల్ బాంగ్, సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు, ప్రీ క్లైమాక్స్, స్క్రీన్ ప్లే సినిమాలో ప్లస్ పాయింట్స్.
ఫస్ట్ హాఫ్ లో కొన్ని బోరింగ్ సీన్స్, సి.జి.వర్క్, సందర్భం లేకుండా వచ్చే పాటలు సినిమాకు మైనస్ గా నిలిచాయి.. ఫైనల్ గా ‘నేనోరకం’ సినిమా పైసా వసూల్ అనిపించుకుంటుంది. కాకపోతే హీరో రామ్ శంకర్.. ఆడియన్స్ ను ఎంతమేరకు థియేటర్లకు రప్పించగలడనే దానిపైనే సినిమా సక్సెస్ డిపెండ్ అయి ఉంది. మౌత్ టాక్ కనుక వర్కవుట్ అయితే నేనో రకం సినిమా సేఫ్ వెంచర్ అనిపించుకుంటుంది.

 

రేటింగ్ : 3 /5