RRR Shooting and NTR Teaser updates

Saturday,October 03,2020 - 01:19 by Z_CLU

ప్రస్తుతం RRR నుండి రానున్న NTR టీజర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా ఆలస్యమైన తారక్ టీజర్ రిలీజ్ చేసేందుకు జక్కన్న అండ్ టీం సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం నుంచి టీజర్ కోసం ఎన్టీఆర్ పై కొన్ని షాట్స్ షూట్ చేయడానికి టీం రెడీ అవుతుంది.

కోవిడ్ నిబందనలు పాటిస్తూ తక్కువ మంది క్రూతో షూట్ చేయడానికి ఓ ప్రణాళిక రెడీ చేసుకున్నాడు Rajamouli. ప్రస్తుతం ఓ వారం పాటు టీజర్ షాట్స్ మాత్రమే తీయనున్నారని సమాచారం. అయితే RRR NTR Teaser ఈ నెలలో దసరాకి రిలీజ్ చేస్తారనే టాక్ నడుస్తుంది. దీంతో ఫ్యాన్స్ టీజర్ కోసం ఎగ్జయిట్ అవుతున్నారు.

నిజానికి దసరాకి ఇంకా కొన్ని రోజులే ఉంది. మరి ఈ లోపు టీం షూట్ చేసి టీజర్ రెడీ చేస్తారా? అన్నది అనుమానమే.