Allu Arjun reveals Vishnu Manchu’s Mosagallu Teaser

Saturday,October 03,2020 - 01:30 by Z_CLU

Manchu Vishnu హీరోగా Jeffrey Gee Chin దర్శకత్వంలో తెరకెక్కుతున్న Mosagallu టీజర్ విడుదలైంది. స్టైలిష్ స్టార్ Allu Arjun ఈ సినిమా టీజర్ ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశాడు. USA లో జరిగిన అతిపెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి 30 సెకన్స్ టీజర్ ను విడుదల చేసి సినిమాపై బజ్ క్రియేట్ చేసారు మేకర్స్.

టీజర్ లో Trump మీడియాతో స్కామ్ గురించి చెప్తూ, తప్పు చేసిన వారిపై యాక్షన్ తీసుకుంటామని చెప్పే సీన్ తో పాటు "ఇది సరిపోతుందిగా" అంటూ కాజల్, విష్ణును అడిగే సన్నివేశంతో షార్ట్ గా టీజర్ ని కట్ చేసారు. ఆట ఇప్పుడే మొదలైంది అంటూ విష్ణు చెప్పే డైలాగ్ తో టీజర్ ముగుస్తుంది.

Kajal Agerwal హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మంచు విష్ణు రచయితగా పనిచేస్తుండటం విశేషం. AVA Entertainment and 24 Frames Factory బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు Sam C.S మ్యూజిక్ అందిస్తున్నాడు. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.