Raj tarun’s ‘AnubhavinchuRaja’ Trailer Review

Wednesday,November 17,2021 - 12:37 by Z_CLU

శ్రీనివాస్ గవిరెడ్డి డైరెక్షన్ లో రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న 'అనుభవించు రాజా' సినిమా ఈ నెల 26న థియేటర్స్ లోకి వస్తుంది. ఈ సందర్భంగా కింగ్ నాగార్జున సోషల్ మీడియా ద్వారా ట్రైలర్ రిలీజ్ చేశారు. పల్లెటూరిలో అల్లరి చిల్లరిగా ఉంటూ ఎప్పటికైనా ప్రెసిడెంట్ అవ్వాలనుకునే కుర్రాడు తనకి ఎదురైన ఓ సంఘటన వలన సిటీకి వచ్చి సెక్యురిటీ గా మారతాడు. ఈ విషయాన్ని ట్రైలర్ లో చూపించారు. అయితే అసలు ఆ కుర్రాడు సిటీకి ఎందుకు రావలసి వచ్చింది ? అనేది మాత్రం ట్రైలర్ లో సస్పెన్స్ గా ఉంచి కట్ చేశారు.

సినిమా అంతా పల్లెటూరిలో సరదాగా సాగే కామెడీ డ్రామా అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. "రూపాయి పాపాయ్ లాంటిది రా..దాన్ని పెంచి పెద్ద చేసుకోవాలి కానీ ఎవడి చేతిలో బడితే వాడి చేతిలో పెట్టకూడదు" అంటూ వాయిస్ ఓవర్ డైలాగ్ తో పల్లెటూరి విజువల్స్ తో ట్రైలర్ స్టార్ట్ చేసి ఆ వెంటనే "ఈడు ఇప్పుడే ఇలా ఉన్నాడంటే పెద్దయ్యాక ఏమవుతాడో" అంటూ హీరో క్యారెక్టరైజేషణ్ గురించి చెప్తూ సిటీలో సెక్యురిటీ గార్డ్ గా మారిన సీన్స్ వేశారు. ఇక ట్రైలర్ లో 'పోలీసైన పిలిస్తే పది నిమిషాలు ఆలస్యంగా వస్తాడేమో కానీ సెక్యురిటీ అనగానే క్షణల్లో వచ్చే వాడే సెక్యురిటీ అంటూ పోసాని చెప్పిన  డైలాగ్ తో పాటు రాజ్ తరుణ్ డైలాగ్స్ , టైటిల్ సాంగ్ తో వచ్చే విజువల్స్ కూడా ఎట్రాక్షన్ గా నిలిచాయి. ఫైనల్ గా ట్రైలర్ లో ఊరి గొడవలు , హీరో -విలన్ కి మధ్య పందేలు లాంటివి హైలైట్ చేస్తూ సినిమాపై ఆసక్తి నెలకొనేలా చేశాయి.

ఓవరాల్ గా సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అని ట్రైలర్ కట్ తో క్లియర్ కట్ గా చెప్పారు మేకర్స్. రాజ్ తరుణ్ , శ్రీనివాస్ గవిరెడ్డి కాంబినేషన్ లో రెండో సినిమాగా వస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ , శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ LLP బేనర్స్ పై సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు. రిలీజ్ కి ముందే టేబుల్ ప్రాఫీట్ తెచ్చిపెట్టిన ఈ సినిమా వచ్చే వారం సోలోగా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తుంది.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics