Hot Topic బాబాయ్ , అబ్బాయ్ సంక్రాంతి పోటీ !

Wednesday,November 17,2021 - 10:13 by Z_CLU

Hot Topic : Pawan Kalyan , Ram Charan’s Movies in Sankranthi Race

వచ్చే సంక్రాంతి సీజన్ లో మెగా పోటీ నెలకొంది. మెగా ఫ్యామిలీ నుండి పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ చెరో సినిమాతో ఈసారి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ‘RRR‘ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. సరిగ్గా అబ్బాయ్ సినిమా వచ్చిన ఐదు రోజులకే అంటే జనవరి 12 న బాబాయ్ ‘భీమ్లా నాయక్‘ తో థియేటర్స్ ఎంట్రీ ఇస్తున్నాడు.

నిజానికి ఇంత వరకూ మెగా ఫ్యామిలీ లో ఇలాంటి పోటీ జరగలేదు. చిరంజీవి , పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ సినిమాలకు మినిమం గ్యాప్ ఉండేలా చూసుకుంటారు దర్శక నిర్మాతలు. కానీ ఈసారి మెగా పోటీ తప్పలేదు. సంక్రాంతి బరిలో ‘ఆర్ ఆర్ ఆర్’ ఎనౌన్స్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ బడా సినిమాలన్నీ సంక్రాంతి రేస్ నుండి తప్పుకున్నాయి. మహేష్ సర్కారు వారి పాట , F3 సినిమాలతో పాటు మరికొన్ని వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో ‘భీమ్లా నాయక్’ కూడా పోస్ట్ పోన్ అవుతుందనుకున్నారు.

కానీ  ఉన్నపళంగా ఇప్పుడు సంక్రాంతి రేస్ లో పవన్ అడుగుపెట్టాడు. దీంతో బాబాయ్ , అబ్బాయ్ మధ్య సంక్రాంతి పోటీ అంటూ కథనాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. నిజానికి మిగతా అందరూ మెగా పోటీ అంటూ డిస్కషన్ చేస్తుంటే మెగా ఫ్యాన్స్ మాత్రం వారానికో మెగా సినిమా అనుకుంటూ హ్యాపీ గా ఫీలవుతున్నారు. అబ్బాయ్ పెర్ఫార్మెన్స్ చూసిన వారానికే పవన్ మాస్ అవతార్ చూడబోతున్నాం అంటూ సంతోషంలో ఉన్నారు.

– Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics