రిపీట్ అంటున్న Raj Tarun !

Saturday,March 06,2021 - 11:35 by Z_CLU

కొంత మంది హీరోలు తమను డైరెక్ట్ చేసిన దర్శకులతోనే ఎక్కువ సినిమాలు చేస్తుంటారు. ఆ లిస్టులో ఇప్పుడు యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా చేరబోతున్నాడు. అవును ఆల్రెడీ తనతో సినిమా చేసిన దర్శకులతోనే రాజ్ తరుణ్ సినిమాలు చేస్తున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో తనను డైరెక్ట్ చేసిన శ్రీనివాస్ గవిరెడ్డి తో ప్రస్తుతం సినిమా చేస్తున్న ఈ కుర్ర హీరో మళ్ళీ విజయ్ కుమార్ కొండా తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈసారి ఈ ఇద్దరు కలిసి ‘డ్రీం గర్ల్’ రీమేక్ తో రాబోతున్నారు.

ఇక తనను హీరోగా పరిచయం చేసిన విరించి వర్మతో కూడా ఒక సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడు రాజ్ తరుణ్. తాజాగా ఆ విషయాన్ని తనే స్వయంగా చెప్పుకున్నాడు. ప్రస్తుతం తనతో వర్క్ చేసిన డైరెక్టర్స్ ముగ్గురితో మూడు సినిమాలు చేయనున్న రాజ్ తరుణ్ కొత్త దర్శకులతో కూడా సినిమాలు చేస్తున్నాడు. మరి ఈ రిపీట్ కాంబినేషన్స్ లో వచ్చే సినిమాలు రాజ్ తరుణ్ కి ఎలాంటి హిట్స్ అందిస్తాయో చూడాలి.