Pawan-Krish Movie first look today

Thursday,March 11,2021 - 09:42 by Z_CLU

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు ఈరోజు బిగ్ డే. క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ చేస్తున్న సినిమాకు సంబంధించి ఈరోజు అప్ డేట్ రాబోతోంది. సరిగ్గా సాయంత్రం 5 గంటల 19 నిమిషాలకు ఈ సినిమా అప్ డేట్ రాబోతోంది.

అయితే పవన్-క్రిష్ మూవీ నుంచి ఏం రాబోతోందనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కేవలం ఫస్ట్ లుక్ గ్లింప్స్ అని మాత్రమే ప్రకటించారు. టైటిల్ ను రివీల్ చేస్తారా చేయరా అనేది చెప్పలేదు. మొత్తమ్మీద పవన్-క్రిష్ మూవీ నుంచి ఓ వీడియో రాబోతోందనేది మాత్రం పక్కా.

Pawan krish pspk27

ఈ సినిమాకు హరహర వీరమల్లు అనే టైటిల్ పెట్టినట్టు టాక్. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ పీరియాడిక్ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు.