Nani with Young Directors Only

Friday,November 13,2020 - 02:35 by Z_CLU

ప్రస్తుతం యంగ్ హీరోలు టాలెంటెడ్ డైరెక్టర్స్ తో పర్ఫెక్ట్ గా సినిమాలు ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఆ లిస్టులో Hero Nani ముందు వరుసలో ఉన్నాడు. అవును.. స్టార్ దర్శకులతో కాకుండా కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన యంగ్ స్టర్స్ చెప్పిన స్క్రిప్ట్స్ కే ఒకే అంటున్నాడు.

ఇప్పటికే Rahul Sankrityan తో Shyam Singha Roy మూవీ చేస్తున్న నాని... నెక్స్ట్ మరో టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు. 'బ్రోచేవారెవరురా' సినిమాతో తన టాలెంట్ ఏంటో నిరుపించుకొని సూపర్ హిట్ అందుకున్న వివేక్ ఆత్రేయతో నెక్స్ట్ సినిమా ఎనౌన్స్ చేసాడు నాని. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది.

ప్రస్తుతం శివ నిర్వాణతో చేస్తున్న Tuck Jagadish పూర్తయిన వెంటనే ఈ రెండు ప్రాజెక్ట్స్ ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు నాని. మరి ఈ టాలెంట్ డైరెక్టర్స్ తో నాని ఎలాంటి సూపర్ హిట్స్ అందుకుంటాడో వేచి చూడాలి.

Also Read - నాని Vs నారా రోహిత్