Vijay Deverakonda’s ‘Khushi’ Trailer Review

Wednesday,August 09,2023 - 04:17 by Z_CLU

విజయ్ దేవరకొండ , సమంత కాంబినేషన్ లో శివ నిర్వాణ తెరకెక్కించిన ఖుషి కి సంబందించి ట్రైలర్ రిలీజైంది. ఇప్పటికే సాంగ్స్ , టీజర్ తో ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ తో మరిన్ని అంచనాలు నెలకొల్పింది. గీత గోవిందం తర్వాత విజయ్ నుండి వస్తున్న కంప్లీట్ లవ్ అండ్ ఫ్యామిలీ సినిమా ఇది.

కాశ్మీర్ పర్యటనకు వెళ్లి అక్కడ ముస్లిం అమ్మాయి(సమంత) తో ప్రేమలో పడిన విప్లవ్(విజయ్ దేవరకొండ) ఆమె స్వచ్ఛమైన బ్రాహ్మణ కులానికి చెందిన ఆరాద్య అని తెలుసుకుని షాక్ అవుతాడు. క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన విప్లవ్ బ్రాహ్మిన్ కుటుంబానికి చెందిన ఆరాధ్య తమ కుటుంబాలకు ఇష్టం లేకపోయినా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వేరు కాపురం పెడతాడు. మొదట్లో బాగానే ఉన్నా మెల్లగా ఈ జంట మధ్య చిన్న చిన్న అపార్థాలు మొదలవుతాయి. పెద్దలు భయపడిందే జరుగుతుంది కానీ విప్లవ్ ఆరాధ్యల సంకల్పం వేరే ఉంటుంది. అందులో గెలవడమే ఖుషి. సినిమా కథను ట్రైలర్ లో క్లియర్ గా చెప్పేశాడు దర్శకుడు. సినిమాలో ఉండే కాస్టింగ్ అంతా ట్రైలర్ లో చూపించేశారు.

ట్రైలర్ లో విజయ్ , సమంత కెమిస్ట్రీ బాగుంది. వారి మధ్య లవ్ సీన్స్ , భార్య భర్తలుగా వచ్చే సీన్స్ ఆకట్టుకున్నాయి. పెళ్లి తర్వాత వచ్చే సీన్స్ ట్రైలర్ లో హైలైట్ అనిపించాయి. హెషం మ్యూజిక్ ట్రైలర్ కి మరింత అందం తీసుకొచ్చింది. అలాగే మురళి విజువల్స్ కూడా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కాశ్మీర్ లొకేషన్స్ ను తన కెమెరాలో బంధించిన తీరు బాగుంది. ఓవరాల్ గా 2 నిమిషాల 45 సెకన్ల ట్రైలర్ 'ఖుషి'పై మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెంచింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్ తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళం , హిందీ భాషల్లో విడుదల కానుంది.