నాని

Sunday,November 22,2020 - 03:01 by Z_CLU

నాని గంట ఫిబ్రవరి 24, 1984 లో జన్మించారు. మొదట బాపు, శ్రీను వైట్ల వంటి దర్శకుల దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన నాని ‘అష్టాచమ్మా’ చిత్రం తో తెలుగు చిత్ర పరిశ్రమ కు పరిచయం అయ్యారు. తొలి చిత్రం తో నటుడిగా మంచి మార్కులు అందుకున్న  నాని కథానాయకుడిగా టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకున్నారు.

‘అలా మొదలైంది’, ‘పిల్ల జమిందార్’, చిత్రాలతో  విజయాలు అందుకున్న నాని రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ‘ఈగ’ చిత్రం తో ఘన విజయం అందుకున్నారు.

తెలుగు తో పాటు తమిళ్ చిత్రాల్లోనూ నటిస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్న నాని  ‘భలే భలే మగాడివోయ్’ చిత్రంతో మరో సూపర్ హిట్ సాధించి బెస్ట్ యాక్టర్ కెటగిరి కి గాను ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు. ఈ చిత్రం తరువాత ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’, ‘జెంటిల్ మన్’, ‘మజ్ను’ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న నాని  ‘నేను లోకల్’ తో మరో కమర్షియల్ హిట్ కొట్టాడు. తర్వాత జెర్సీ సినిమాతో ఎమోషనల్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో టాలీవుడ్ బిజీ హీరోగా కొనసాగుతున్నాడు.

Born : 24 February 1984
Zodiac : Aquarius
Height : 5.8 Feet

సంబంధిత గ్యాలరీ

సంబంధిత వార్తలు