Nagarjuna Speech at Bangarraju Pre release event

Friday,January 14,2022 - 09:03 by Z_CLU

బంగార్రాజు సినిమా చూసిన తర్వాత తన ఫ్యాన్స్ అంతా మీసం తిప్పుతారని చెబుతున్నాడు నాగార్జున. ఈ సినిమాలో తను మీసం తిప్పానని, నాగచైతన్య కూడా మీసం తిప్పాడని.. కానీ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు మీసం తిప్పుతారని అన్నారు. బంగార్రాజు ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఫంక్షన్ లో మాట్లాడిన నాగ్.. తన యూనిట్ టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాడు.

బంగార్రాజులో ఓ కొత్త నాగచైతన్యను చూస్తారంటున్నాడు నాగ్. ఇది తన ప్రామిస్ అని, మాస్ కోరుకున్న అక్కినేని అభిమానులంతా చైతన్యలో అది చూస్తారని అన్నాడు. లవ్ స్టోరీస్ నుంచి మాస్ లుక్ లోకి నాగచైతన్య బాగా మారాడని మెచ్చుకున్నాడు.