Nagarjuna’s Bangarraju gets positive talk all over

Friday,January 14,2022 - 08:50 by Z_CLU

కింగ్ నాగార్జున, యంగ్ యువ సామ్రాట్ నాగచైతన్య హీరోలుగా నటించిన మల్టీస్టారర్ మూవీ బంగార్రాజు, ఈరోజు వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజైంది. పండగ సినిమాగా వచ్చిన బంగార్రాజుకు అన్ని ఏరియాస్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సంక్రాంతికి సరైన పండగ సినిమా ఇదే అంటున్నారంతా.

స్వర్గంలో బంగార్రాజు ఎంట్రీ, క్లైమాక్స్ లో ముగ్గురు బంగార్రాజుల ఫైట్, చైతూ మాస్ యాక్టింగ్.. సినిమాకు హైలెట్స్ అని చెబుతున్నారు. ఓవర్సీస్ నుంచి ఆల్రెడీ వచ్చిన రిపోర్ట్ ప్రకారం.. సోగ్గాడే చిన్ని నాయనాకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉందంట బంగార్రాజు.

నాగార్జున-రమ్యకృష్ణ మరోసారి తమ పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేయగా.. ఈ సీక్వెల్ లో నాగచైతన్య-కృతిశెట్టి ఫ్రెష్ కాంబినేషన్, వాళ్ల కెమిస్ట్రీ అదిరిందని చెబుతున్నారు చూసినవాళ్లు.

అనూప్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. కల్యాణ్ కృష్ణ డైరక్షన్ సినిమాకు మెయిన్ ఎస్సెట్స్ కాగా.. నాగార్జున-నాగచైతన్య ఈ మూవీకి మెయిన్ పిల్లర్స్ గా నిలిచినట్టు ఎర్లీ టాక్ చెబుతోంది. మొత్తమ్మీద ఈ ఏడాది సంక్రాంతి సోగ్గాళ్లు అనిపించుకున్నారు నాగార్జున, నాగచైతన్య