Nagarjuna Speech at Bangarraju Success Meet

Saturday,January 15,2022 - 03:34 by Z_CLU

నిన్న రిలీజైన బంగార్రాజు సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. అసలైన సంక్రాంతి సినిమా అనిపించుకుంది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు నాగార్జున. టెక్నీషియన్స్ అందరికీ మరోసారి థ్యాంక్స్ చెప్పిన నాగ్.. ఇది తనకు అసలైన సంక్రాంతి అన్నారు.

bangarraju success

- సినిమా అంటే సంక్రాంతి.. సంక్రాంతి అంటే సినిమా అనే విషయాన్ని తెలుగు ప్రేక్షకులు మరోసారి ప్రూవ్ చేశారు. బంగార్రాజును అద్భుతంగా ఆదరించారు. అందరికీ చాలా థ్యాంక్స్. బంగార్రాజును మేం పండగ సినిమా అనుకున్నాం. దాన్ని అలానే పండగలా రిసీవ్ చేసుకున్నారు.

- టెక్నీషియన్స్ అంతా విసుక్కోకుండా పనిచేశారు. దాదాపు 80 రోజుల పాటు నాన్-స్టాప్ గా షూటింగ్ చేశాం. మధ్యలో ఆదివారాలు మాత్రమే గ్యాప్ ఇచ్చాం. ఇలా ఎప్పుడూ నేను వర్క్ చేయలేదు. టెక్నికల్ టీమ్ అందరికీ థ్యాంక్స్. జీ స్టుడియోస్ వాళ్లు చాలా బాగా కోపరేట్ చేశారు. వాళ్లకు థ్యాంక్స్. అందరూ ఓ ప్రేమతో ఈ సినిమా చేశారు. అదే ప్రేమను ప్రేక్షకులు తిరిగిస్తున్నారు.

bangarraju success

- ఈ సినిమా చూశాక పెద్ద బంగార్రాజు పాత్ర ఎక్కువ వుంద‌ని చాలామంది అన్నారు. అది పాత్ర‌ప‌రంగా ద‌ర్శ‌కుడు డిజైన్ చేసిందే. సినిమా చూసిన‌వారంతా వారి భావోద్వేగాలు తెలియ‌జేస్తుంటే, తీసిన సినిమాకు సార్థ‌క‌త ఏర్ప‌డింద‌నిపించింది. బంగార్రాజు సినిమా చూశాక అమ‌ల ఇంటికి రాగానే ఆమె అత్త‌, మామ గారి ఫొటోల‌కు దండం పెట్టుకుని ఏడ్చేసింది. అవి ఆనందంతో కూడిన క‌న్నీళ్ళు. వారు మ‌న‌ల్ని చూసుకుంటున్నారు క‌దా అని చెప్పింది. వారు మా వెనుక వున్నార‌నే ఫీలింగ్‌ను వ్య‌క్తం చేసింది. ఇదే అభిప్రాయాన్ని చాలామంది వారి అమ్మ‌మ్మ‌లు, నాయ‌న‌మ్మ‌లు, తాత‌య్య‌లు, నాన్న‌ల‌ను గుర్తుచేసుకున్నామ‌ని చెప్పారు.