NagaChaitanya next with Chandoo Mondeti in GA2 ?

Wednesday,June 21,2023 - 10:25 by Z_CLU

'కార్తికేయ 2' తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ డెలివరీ చేసిన దర్శకుడు చందూ మొండేటి నెక్స్ట్ సినిమాకు రెడీ అవుతున్నాడు. గీతా ఆర్ట్స్ బేనర్ లో నెక్స్ట్ సినిమా చేయబోతున్న చందూ మొండేటి నాగ చైతన్యతో ఆ ప్రాజెక్ట్ చేయబోతున్నాడని తెలుస్తుంది. చైతు - చందూ కాంబినేషన్ లో 'సవ్యసాచి' అనే సినిమా వచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఆ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది.  ఇప్పుడు తమ కాంబోలో  రాబోతున్న రెండో సినిమా విషయంలో చందూ చాలా జాగ్రత్త వహిస్తున్నాడట.

ఇటీవలే స్టోరీ లాక్ అయిన ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. గీతా ఆర్ట్స్ 2 పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మించనున్న ఈ మూవీ జులై లేదా ఆగస్ట్ నుండి సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. త్వరలోనే ఈ కాంబో మూవీ ఎనౌన్స్ మెంట్ రానుంది. ఈ సినిమా తర్వాత నాగ చైతన్య శివ నిర్వాణ తో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు.