Nagarjuna-Akhil Multistarrer on Cards

Thursday,November 12,2020 - 12:01 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో తండ్రి కొడుకుల కాంబినేషన్ ప్రచారంలో ఉంది. Akkineni హీరోలు Nagarjuna-Akhil కాంబోలో సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. F2, Sarileru Neekevvaru సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ డెలివరీ చేసిన Anil Ravipudi తాజాగా నాగార్జున కి ఓ కథ వినిపించాడని అందులో ఓ స్పెషల్ రోల్ లో అఖిల్ కనిపిస్తాడని టాక్ గట్టిగా నడుస్తోంది.

నిజానికి F2 తో మల్టీ స్టారర్ సినిమాలను బాగా హ్యాండిల్ చేయగలడనే ముద్ర వేసుకున్న అనిల్ రావిపూడి నిజంగా ఈ అక్కినేని మల్టీ స్టారర్ సినిమా చేస్తే అభిమానులకు పండగే. ఇంకొన్ని రోజుల్లో ఈ కాంబినేషన్ సినిమా న్యూస్ నిజామా లేదా అనేది తేలిపోతుంది. అప్పటి వరకు ఈ కాంబో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ అంచనాలు నెలకొలుపుతుంది.

anil ravipudi

నిజానికి నాగార్జున, అఖిల్ కలిసి నటించడం కొత్తేంకాదు. అఖిల్ ఫస్ట్ మూవీలోనే నాగ్ స్పెషల్ సాంగ్ చేశాడు. అంతకంటే ముందు నాగ్ తీసిన మనం సినిమా క్లైమాక్స్ లో అఖిల్ కనిపించాడు. కాకపోతే ఈసారి నాగ్ సినిమాలో ఇంకాస్త ఎక్కువ రన్ టైమ్ తో అఖిల్ కనిపిస్తాడట.

Also Check - అఖిల్ కొత్త సినిమాలో క్రేజ్ హీరోయిన్