అఖిల్ అక్కినేని

Thursday,June 23,2016 - 06:12 by Z_CLU

అక్కినేని అఖిల్ ప్రముఖ కథానాయకుడు. ఏప్రిల్ 8 , 1994 లో జన్మించారు. అఖిల్ ప్రముఖ కథానాయకుడు నాగార్జున, కథానాయిక అమల తనయుడు. 1995 లో శివ నాగేశ్వరావు దర్శకత్వం లో నాగార్జున కథానాయకుడిగా తెరకెక్కిన ‘సిసింద్రీ’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు బాల నటుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రానికి గాను బెస్ట్ చైల్డ్ యాక్టర్ కేటగిరి లో ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు. 2014 లో అక్కినేని కుటుంబ కథా చిత్రం ‘మనం’ లో అతిధి పాత్రలో నటించారు. 2015 లో వి.వి.వినాయక్ దర్శకత్వం లో తెరకెక్కిన’అఖిల్’ సినిమాతో కథానాయకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఈ సినిమాకు గాను బెస్ట్ మేల్ డెబ్యూట్ కేటగిరి లో ఫిలిం ఫేర్ అవార్డు ను అందుకున్నారు.

Born : 8 April 1994
Zodiac : Virgo
Height : 5.10 Feet

సంబంధిత వార్తలు