Mahesh Babu tested positive for Corona

Thursday,January 06,2022 - 10:16 by Z_CLU

హీరో మహేష్ బాబుకు కరోనా సోకింది. తాజాగా నిర్వహించిన టెస్టుల్లో తనకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయినట్టు స్వయంగా మహేష్ ప్రకటించాడు. తనకు చాలా స్వల్పంగా మాత్రమే లక్షణాలున్నట్టు తెలిపాడు. "అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ నాకు కరోనా సోకింది. స్వల్ప లక్షణాలున్నాయి. వైద్యుల పర్యవేక్షణలో మా ఇంట్లో నేను ఐసొలేషన్ లో ఉన్నాను. ఈమధ్య కాలంలో నాతో కాంటాక్ట్ లోకి వచ్చిన వాళ్లంతా విధిగా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను." ఇలా తనకు కరోనా సోకిన విషయాన్ని బయటపెట్టాడు ఈ హీరో. ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోని వాళ్లంతా విధిగా టీకాలు వేయించుకోవాలని, దాని వల్ల కరోనా ముప్పును గణనీయంగా తగ్గించొచ్చదని విజ్ఞప్తి చేశాడు మహేష్. ప్రజలంతా కచ్చితంగా నిబంధనలు పాటించాలన్నాడు. రీసెంట్ గా దుబాయ్ వెళ్లొచ్చాడు మహేష్. అక్కడే కుటుంబంతో కలిసి నూతన సంవత్సర వేడుకలు కూడా సెలబ్రేట్ చేసుకున్నాడు. అదే వేడుకల్లో దర్శకుడు వంశీ పైడిపల్లి కుటుంబంతో పాటు, మరికొంతమంది మహేష్ బంధువులు కూడా పాల్గొన్నారు.