SSMB28 Title reveal on May 31st on the occasion of Krishna Garu Birthday
Tuesday,March 28,2023 - 11:42 by Z_CLU
సూపర్ స్టార్ మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న SSMB28కి సంబంధించి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. తాజాగా విడుదల చేసిన సంక్రాంతి రిలీజ్ పోస్టర్లో టైటిల్ లేకపోయే సరికి మహేష్ ఫ్యాన్స్ నిరాశ పడ్డారు. అయితే పోస్టర్ లో మహేష్ మాస్ స్టిల్ అభిమానులను ఆకట్టుకుంది. పైగా సంక్రాంతి రిలీజ్ డేట్ ప్రకటించడంతో పండుగ హంగామా ఇప్పటి నుండే మొదలైంది.
ఈ సినిమాకు సంబంధించి 'అమరావతికి అటు,ఇటు' , 'గుంటూరు కారం' అనే టైటిల్స్ చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారా ? అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే తాజాగా నిర్మాత నాగ వంశీ సినిమాకు సంబంధించి నెక్స్ట్ అప్ డేట్ మే 31 న సూపర్ స్టార్ పుట్టిన రోజు ఉండనున్నట్లు ప్రకటించాడు.
ప్రతీ ఏటా సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం రోజు మహేష్ బాబు తన అప్ కమింగ్ సినిమా నుండి ఏదో ఒక అప్ డేట్ ఇచ్చి నాన్నని విశ్ చేయడం సెంటిమెంట్ గా మారింది. ఈ ఏడాది కృష్ణ గారు భౌతికంగా లేరు. అయినా ఆ సెంటిమెంట్ ను కొనసాగిస్తూ తండ్రికి బర్త్ డే విషెస్ చెప్పి ఆయన్ను గుర్తుచేసుకొనున్నాడు మహేష్. అదే రోజు టైటిల్ రివీల్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. సో ssmb28 టైటిల్ ఏంటో తెలియాలంటే ఫ్యాన్స్ అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.
- Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics