Mahesh Babu, Trivikram’s ‘SSMB28’ Shooting Updates

Tuesday,February 21,2023 - 01:08 by Z_CLU

మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న SSMB28కి సంబంధించి ఇటీవలే యూనిట్ ఓ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. సారదీ స్టూడియోస్ లో ఓ యాక్షన్ ఎపిసోడ్ తీసి హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో కొన్ని సన్నివేశాలు తీశారు. ఆ షెడ్యూల్ తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న యూనిట్ వచ్చేవారం నుండి మరో షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నారు.

ఈ షెడ్యూల్ లో మహేష్ , మిగతా నటీ నటులపై ఇంటి సన్నివేశాలు తీయనున్నారు. ఇందుకోసం హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఓ హౌస్ సెట్ వేశారు. ఆ సెట్ లోనే కీలక సన్నివేశాలు తీయనున్నారు. పూజ హెగ్డే , శ్రీలీల ఈ షెడ్యూల్ లో జాయిన్ అవ్వనున్నారు. ఇందులో జగపతి బాబు విలన్ గా నటించబోతున్నాడని సమాచారం. ఆయన కూడా ఇదే షెడ్యూల్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది.

హారికా హాసినీ క్రియేషన్స్ పై రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజర్. ఆగస్ట్ లో సినిమాను థియేటర్స్ లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics