Allu Arjun’s ‘Pushpa 2’ Latest updates

Thursday,January 06,2022 - 04:34 by Z_CLU

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'పుష్ప ది రైజ్' ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయింది. కేవలం తెలుగు భాషలోనే కాకుండా అన్ని భాషల్లో పాన్ ఇండియా లెవెల్ లో భారీ కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమాకు ఊహించని రేంజ్ లో భారీ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో ఇప్పుడు పుష్ప టీంలో కొత్త ఉత్సాహం మొదలైంది. ఆ ఎనర్జీతోనే త్వరలోనే 'పుష్ప ది రూలర్' పార్ట్ 2 వర్క్ మొదలు పెట్టబోతున్నారు.

ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 కి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. మార్చ్ నుండి సినిమాను సెట్స్ పై పెట్టేందుకు రెడీ అవుతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది ఎండింగ్ లోనే డిసెంబర్ 17న పార్ట్ ని థియేటర్స్ లోకి తీసుకురావాలని చూస్తున్నారు. డిసెంబర్ రిలీజ్ టార్గెట్ గానే సినిమా రెడీ అవ్వబోతుంది. ప్రస్తుతం సుక్కు తన టీంతో కలిసి స్క్రిప్ట్ కి ఇంకా మెరుగులు దిద్దుతున్నాడు. పార్ట్ 1 కి వచ్చిన రెస్పాన్స్ తో రెండో భాగాన్ని మరింత పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాడు.

మార్చ్ లేదా ఏప్రిల్ నుండి మొదటి షెడ్యుల్ స్టార్ట్ చేసి ఏడెనిమిది నెలల్లో టోటల్ షూట్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. ముందుగా మారేడు మిల్లిలో కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తారని తెలుస్తుంది. ఆ తర్వాత హైదరాబాద్ లో రెండో షెడ్యుల్ ప్లాన్ చేసుకుంటారట. పార్ట్ 1 లో ఉన్న నటీ నటులే రెండో భాగంలోనూ ఉంటారు. కాకపోతే మొదటి భాగంలో ఉన్న ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ కి ఎక్కువ స్కోప్ ఉండనుంది. ముఖ్యంగా ఫహద్ ఫాసిల్ రోల్ ఇందులో కీలకంగా ఉండబోతుంది. అలాగే సునీల్ , అనసూయ పాత్రలు కూడా రెండో భాగంలో మరింత ఎలివేట్ అవుతాయని సుకుమార్ ప్రకటించాడు. రెండో భాగానికి సంబంధించి బన్నీ ఇప్పటికే హోం వర్క్ మొదలు పెట్టేసాడని తెలుస్తుంది.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics