‘King Of Kotha Movie’ Review

Thursday,August 24,2023 - 03:12 by Z_CLU

నటీ నటులు : దుల్కర్ సల్మాన్ , ఐశ్వర్య లెక్ష్మి , ఉషా నైలా , షబీర్ , ప్రసన్న , గోకుల్ , అనికా తదితరులు

మ్యూజిక్ : జేక్స్ బీజాయ్

కెమెరా : నిమిషా రవి

నిర్మాణం : దుల్కర్ సల్మాన్ , జీ స్టూడియోస్

దర్శకత్వం : అభిలాష్ జోషి

విడుదల : 24 ఆగస్ట్ 2023

 

'సీతారామం'తో తెలుగులో బ్లాక్ బస్టర్ అందుకున్న దుల్కర్ సల్మాన్ తాజాగా కింగ్ ఆఫ్ కొత్త అనే డబ్బింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మరి దుల్కర్ ఆ అంచనాలను అందుకున్నాడా ? మాస్ ఆడియన్స్ ను మాస్ మసాలా యాక్షన్ డ్రామాతో మెప్పించాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

 

కథ : 

కోత అనే ఊరిలో ఎదురు లేని కింగ్ గా జీవిస్తుంటాడు రాజు (దుల్కర్).  తార(ఐశ్వర్య లెక్ష్మి) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. కానీ తార తనని మోసం చేసిందని తెలుసుకొని కుంగిపోతాడు. ఇదే సమయంలో రాజును చంపేందుకు రంజిత్ గ్యాంగ్ ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో రాజు స్నేహితుడు కణ్ణన్ ( షబీర్) రంజిత్ తో కలిసిపోయి రాజు వద్దన్న పని మొదలు పెట్టేందుకు చూస్తాడు. విషయం తెలుసుకొని కణ్ణన్ ని  కొట్టి మందలించి ఆ ఊరికి దూరంగా ఉత్తర్ ప్రదేశ్ కి వెళ్ళిపోతాడు రాజు. అక్కడి నుండి కోత ఊరు మరోలా తయారవుతుంది. ఆ ఊరికి కొత్తగా నియకమైన ఐపిఎస్ ఆఫీసర్ ప్రసన్న, రాజును మళ్ళీ ఆ ఊరికి తీసుకొచ్చి డాన్ గా ఎదిగిన కణ్ణన్ గ్యాంగ్ కి చెక్ పెట్టాలని భావిస్తాడు. మరి రాజు మళ్ళీ కోత ప్రాంతానికి ఎలా తిరిగి వచ్చాడు ? వచ్చాక కణ్ణన్ ను అతని గ్యాంగ్ ని ఎలా అంతమొందించాడు ? అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు : 

దుల్కర్ సల్మాన్ నటన గురించి చెప్పుకుంటే రాజు అనే గ్యాంగ్ స్టర్ గా పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేశాడు. తన స్వాగ్ చూపిస్తూ కేరెక్టర్ కి పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. కొన్ని యాక్షన్ సీక్వెన్సుల్లో ఫైట్స్ తో మాస్ ప్రేక్షకులను మెప్పించాడు. ఐశ్వర్య లక్ష్మి తన నటనతో ఆకట్టుకుంది కానీ గ్లామర్ తో ఎట్రాక్ట్ చేయలేకపోయింది. విలన్స్ గా చెంబన్ వినోద్ , షబీర్ ఆకట్టుకున్నారు. మంజు పాత్రలో ఉషా నైలా ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన బాగుంది. ప్రసన్న , గోకుల్ పోలీస్ పాత్రలకు పర్ఫెక్ట్ అనిపించారు. చెల్లెలి పాత్రలో అనిఖా సురేంద్రన్ పరవాలేదనిపించుకుంది. నటనకి స్కోప్ ఉండే సన్నివేశాలు ఆమెకి దక్కలేదు. మిగతా నటీ నటులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.

 

సాంకేతిక వర్గం పనితీరు : 

ఏ సినిమాకాయినా ఇంపాక్ట్ తీసుకొచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ముఖ్యం. ఈ సినిమాకు జేక్స్ బెస్ట్ వర్క్ ఇచ్చాడు. హీరోయిజాన్ని తన స్కోర్ తో చాలా సందర్భాలలో ఎలివేట్ చేస్తూ సినిమాకు హైలైట్ గా నిలిచాడు. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లకు తన స్కోర్ తో గూస్ బంప్స్ తెప్పించాడు. నిమిషా రవి విజువల్స్ తో సినిమాకు ప్లస్ అయ్యారు. ఉమా శంకర్ ఎడిటింగ్ లో లెంగ్త్ పై ఆలోచించి కాస్త క్రిస్ప్ గా కట్ చేస్తే బాగుండేది. అక్కడక్కడా కొన్ని సందర్భాలలో వచ్చే మాటలు ఆకట్టుకున్నాయి. అభిలాష్ జోషి కొన్ని సన్నివేశాలను , యాక్షన్ సీక్వెన్స్ లను డీల్ చేసిన విధానం బాగుంది. దర్శకుడిగా అక్కడక్కడా మంచి మార్క్స్ స్కోర్ చేశాడు. ప్రొడక్షన్ వెల్యూస్ కథకి తగ్గట్టుగా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష : 

గ్యాంగ్ స్టర్ కథలతో ఇప్పటికే ఎన్నో సినిమాలొచ్చాయి. ఈ జానర్ సినిమాళ్లో చెప్పేందుకు కొత్తగా ఏమి ఉండదు. చిన్న పొజీషన్ నుండి డాన్ గా ఎదిగిన హీరో , అతనిపై ఎటాక్స్ చేస్తుంటే విలన్ గ్యాంగ్ , హీరో ఫ్యామిలీకి విలన్స్ నుండి త్రెడ్ ఉండటం , వారిని కాపాడుకునేందుకు హీరో వేసే ప్లాన్స్ , చివరికి విలన్ ను చంపడం ఇదే గ్యాంగ్ స్టర్ యాక్షన్ సినిమాళ్లో ఎక్కువగా కనిపించే కథ. ఈ తరహా సినిమాళ్లో హీరోయిజం ఎలివేషన్ , ఆసక్తిగా నడిపించే స్క్రీన్ ప్లే , డ్రామా బాగా పండే సన్నివేశాలు, మాస్ ను మెప్పించే యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటే సినిమా పాస్ అయిపోతుంది. అందుకే కింగ్ ఆఫ్ కొత్త పై పూర్తి నమ్మకం పెట్టుకున్నాడు దుల్కర్.

నిజానికి ఈ సినిమాలో కొత్తగా చెప్పుకునే కథ లేదు. పైన చెప్పుకున్న పాత చింతకాయ పచ్చడేలానే కనిపిస్తుంది. కానీ హీరో క్యారెక్టర్ తాలూకు ఎలివేషన్ సన్నివేశాలు బాగా వర్కవుట్ అయ్యాయి. రాజు అనే సౌండింగ్ వినిపించినప్పుడల్లా దర్శకుడు ప్లాన్ చేసుకున్న ఎలివేషన్స్ అదిరిపోయాయి. డానికి తోడు జేక్స్ బీజాయ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చింది. కొన్ని సన్నివేశాల్లో సీన్స్ ను డామినేట్ చేసేలా స్కోర్ ఇచ్చాడు జేక్స్.

డ్రామా విషయానికొస్తే అనుకున్నంతగా పండలేదు అలా అని మరీ నిరాశ పరిచే సన్నివేషాలు లేవు. హీరో అతని చెల్లి మధ్య సెంటిమెంట్ పెద్దగా పండలేదు. తండ్రి కొడుకుల ఎమోషన్ ప్రీ క్లైమాక్స్ లో కొంత వర్కవుట్ అయ్యింది. ఇంటర్వెల్ వరకూ సినిమా సాదా సీదా గానే నడుస్తుంది. ఇంటర్వెల్ తర్వాత నుండి యాక్షన్ సీక్వెన్స్ లతో మాస్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ ఆకట్టుకున్నాయి. ఫైట్స్ కొరియోగ్రఫీ బాగుంది. మాస్ ఈ సినిమా నుండి కోరుకునే యాక్షన్ పుష్కలంగా అందింది. దర్శకుడు అభిలాష్ స్క్రీన్ ప్లే , సన్నివేశాలపై ఇంకాస్త శ్రద్ద పెట్టి ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళేది. రన్ టైమ్ కూడా తగ్గించుకుంటే బెటర్ గా ఉండేది. ఎక్కువ రన్ టైమ్ పెట్టుకోవడం వల్ల కథ చాలా సేపటికి ముందుకు సాగనట్టు అనిపిస్తుంది. కాస్టింగ్ విషయానికొస్తే హీరోయిన్ గా ఐశ్వర్య లక్ష్మి ఎట్రాక్ట్ చేయలేకపోయింది. ఆమె కన్నా నెగటివ్ పాత్రలో కనిపించిన ఉష నైలా ఆకట్టుకుంది.

హీరో ఒక ప్రాంతాన్ని ఏలడం , ఆ తర్వాత ఓ కారణం చేత వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం , తిరిగి మళ్ళీ తన ప్రాంతానికి వచ్చి విలన్ కి చెక్ పెట్టడం ఈ జానర్ కథల్లో రెగ్యులర్ గా కనిపించేదే. 'కింగ్ ఆఫ్ కొత్త' లో కూడా అదే కనిపిస్తుంది. దీంతో  రెగ్యులర్ రొటీన్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ సినిమాలను గుర్తుచేస్తుంది. కానీ నిరాశ పరచదు. దుల్కర్ సల్మాన్ స్వాగ్ పెర్ఫార్మెన్స్ , యాక్షన్ సీక్వెన్స్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , కెమెరా వర్క్ , ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి.

 

రేటింగ్ : 2.75/5